
రుద్రూర్, అక్టోబర్ 3 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి)
రుద్రూర్ మండల కేంద్రంలో దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా కొనసాగాయి. తొమ్మిది రోజులు అమ్మవారు ఒక్కొక్క అవతారంలో భక్తులకు దర్శమిచ్చింది. ఈ సందర్బంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు, నైవేద్యాలు సమర్పించారు. దుర్గాదేవి కమిటీ నిర్వాహకులు శుక్రవారం దుర్గామాత శోభాయాత్రను అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించారు. మహిళలు మంగళహారతులతో, డీజే చప్పుల్లతో, దుర్గామాత మాలధారణ స్వాములు నృత్యాలు చేస్తూ ప్రధాన వీధుల గుండా అమ్మవారి శోభయాత్ర కొనసాగింది. అనంతరం గ్రామ శివారులోని చెరువులో అమ్మవారిని నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, దుర్గామాత కమిటీ సభ్యులు, మాలధారణ స్వాములు, మహిళలు, చిన్నారులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
