
రుద్రూర్, జూలై 29 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి): రుద్రూర్ మండల కేంద్రంతో పాటు చుట్టు ప్రక్కల గ్రామాలల్లో నాగుల పంచమి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. నాగుల పంచమిని పురస్కరించుకొని రుద్రూర్ గ్రామంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం వద్ద గల నాగేంద్రుని ఆలయంలో మహిళలు పాము పుట్టలో పాలు పోసి, ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి రాజేశ్వర్ అప్ప, యువరాజ్ అప్ప, మహిళలు తదితరులు పాల్గొన్నారు.