
పయనించే సూర్యుడు// న్యూస్ ఆగస్టు 30// నారాయణపేట జిల్లా బ్యూరో //
ఉట్కూర్ మండలం చిన్నపొర్ల గ్రామం ప్రాథమిక పాఠశాల LFL హెడ్ మాస్టర్ J. జగదీష్ కుమార్ పదవీ విరమణ కార్యక్రమం శనివారం చిన్నపొర్లలో ఘనంగా జరిగింది. నాయకులు మరియు ఉపాధ్యాయులు మాట్లాడుతూ 4 దశాబ్దాలుగా ఎంతో మంది విద్యార్థులను ఉన్నత శిఖరాలకు చేర్చారని, క్రమశిక్షణ వృత్తి నిబద్ధత ,నిజాయితీకి జగదీష్ సార్ మారు పేరని , నాలుగు దశాబ్దాలుగా సమాజంలో జ్ఞాన జ్యోతిగా వెలుగొందారని పలువురు వక్తలు కొనియాడారు..పదవీ విరమణ తర్వాత జగదీష్ సార్ కుటుంబం ఆయురారోగ్యాలతో ఉండాలని కోరారు..ఈ కార్యక్రమంలో ఊట్కూరు మండల విద్యాధికారి మాధవి మేడం, కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లు సత్యనారాయణ ,గౌరమ్మ, కుసుమ, కిషోర్ కుమార్ , శశిరేఖ, మరియు తపస్ జిల్లా అధ్యక్షులు షేర్ కృష్ణా రెడ్డి, ప్రధాన కార్యదర్శి నరసింహ PRTU జిల్లా అధ్యక్షులు జనార్దన్ రెడ్డి , కృష్ణ, గోపాల్ , శివశంకర్ , బన్నేష్ ,పృథ్వి ఇతర ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు అలాగే సొంత గ్రామ ప్రజలు నాయకులు.సంతోష్ రెడ్డి, డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి, గాండ్ల రాములు, బి విశ్వనాథ్ చిన్నూర్ తిమ్మప్ప, p రాములు, బలిజ సిద్దు, బి బాలు, లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొని సత్కరించారు
