
( పయనించే సూర్యుడు జూలై 25 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండల కేంద్రంలోని దళితవాడలో కొలువైన చింతల పోచమ్మ తల్లి బోనాల పండుగ సందర్భంగా గంట ఊరేగింపులో పాల్గొన్న కొందుర్ మాజీ ఎంపీపీ రాజేష్ పటేల్. పోచమ్మ తల్లి ఆశీస్సులు మండల ప్రజలపై ఉండాలని ప్రతి ఒక్కరు ఈ ఊరేగింపులో పాల్గొని అమ్మవారి పై ఉన్న భక్తిని చాటారు. గంట ఊరేగింపు ఎంతో ఘనంగా జరిపారు. గ్రామస్తులతోపాటు యువకులు పాల్గొన్నారు.మహేందర్, అశోక్ గౌడ్, కల్లు రాజు, కరాటే రమేష్, బబ్లు, ఈశ్వరయ్య గౌడ్, కృష్ణయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
