
పయనించే సూర్యుడు గాంధారి 01/03/25 ప్రపంచ టైలర్స్ డే పురస్కరించుకొని గాంధారి మండల కేంద్రంలో మేరు సంఘం ఆధ్వర్యంలో సంఘ సభ్యులు అందరూ కలిసి కుల దైవమైన శ్రీ శ్రీ శ్రీ శంకర్ దాస్మయ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు అనంతరం గాంధారి తాసిల్దార్ సతీష్ రెడ్డికి మేరు సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని సమర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలలో మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని కులస్తుల్లో నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని అర్హులైన వారికి నిజ మంజూరు చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో నారాయణ రాజు, సాయిబాబా, నర్సింలు, మోహన్, అరుణ్, రామ్మోహన్, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు