
పయనించే సూర్యుడు మార్చి 8 టేకులపల్లి రిపోర్టర్ (పొనకంటి ఉపేందర్ రావు) శనివారం ప్రపంచ మహిళ దినోత్సవం ఇందిరా మహిళా శక్తి సంబరాలు 2025 సులానగర్ లోని జడ్పీ హైస్కూల్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో డీపీవో చంద్రమౌళి సీడీపీఓ ఎం.తారా, సూపర్వైజర్ బి.నిర్మల లు మాట్లాడుతూ. మహిళలు అన్ని రంగాలలో ముందు ఉండాలి స్వయంసేవ సంఘాల ద్వారా రుణాలు పొంది స్వయం శక్తితో ఎదగాలి, బాల్యవివాహన నిర్మూలించాలి ప్రతి ఆడపిల్ల కూడా తప్పకుండా చదువుకోవాలి, ఇంట్లో ఆడవారు ఆరోగ్యంగా ఉంటే ఇల్లు ఆరోగ్యంగా ఉంటుంది కనుక మంచి పౌష్టికాహారం తీసుకోవాలని ఈ పోటీ ప్రపంచంలో అన్ని రంగాలలో మహిళలు ముందుండాలని అన్నారు. అనంతరం గ్రామపంచాయతీ కార్యదర్శి పవిత్ర మాట్లాడుతూ. జిల్లాలో మొత్తం లో ఉమెన్ ఫ్రెండ్లీ గ్రామపంచాయతీగా సులానగర్ గ్రామపంచాయతీ ఎంపిక కావడం చాలా సంతోషంమని గ్రామ ప్రజల సహకారాలతో ఇంకా ఎన్నో సాధిస్తామని అందుకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం కౌసల్య సింగ్, అంగన్వాడి టీచర్స్ మంగతాయారు, రాజేశ్వరి,పద్మ, ఆశా వర్కర్స్ చంద్రకళ,చైతన్య, గ్రామ పంచాయతీలోని మహిళలు