
పయనించే సూర్యుడు మార్చి 17 టేకులపల్లి రిపోర్టర్ (పొనకంటి ఉపేందర్ రావు)
ఇల్లందుసౌర విద్యుత్ అధికారి కోట సురేష్ ఆధ్వర్యంలో రాబోయే కాలంలో విద్యుత్ నియంత్రణనకు ప్రత్యామ్నాయంగా సౌర విద్యుత్ను ప్రజలకు అందుబాటులో తెచ్చేందుకు ఆల్ఫా టెక్ ఎనర్జీస్ అండ్ ఇన్ఫ్రా ఏజెన్సీ ముందడుగు వేసింది. ఈ కార్యక్రమంలో భాగంగా సోమవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం లో ఎమ్మెల్యే కోరం కనకయ్య చేతుల మీదుగా ఆల్ఫాటెక్ లోగో తో ఉన్నటువంటి టీ షర్ట్ లను, మరియు టోపీలను ఆవిష్కరించారు. ఈ టి షర్ట్స్ ని ఇల్లందులో ఉన్నటువంటి ఎలక్ట్రిషన్ అండ్ ప్లంబర్స్ కు టీ షర్ట్స్, టోపీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో. ఇల్లందు మాజీ వైస్ ఎంపీపీ మండల రాము, మడుగు సాంబమూర్తి, వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ బొల్లి రాజు, గోచికొండ సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.