
జన్మదినం సందర్భంగా అఖండ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బధిరుల విద్యార్థిని విద్యార్థులకు అన్నసంతర్పరణ, దుప్పట్లు పంపిణీ.
పయనించే సూర్యుడు బాపట్ల మార్చి 18:- రిపోర్టర్ (కే శివకృష్ణ)
బాపట్ల వెదుళ్ళపల్లి బధిరుల పాఠశాలలో సోమవారం అఖండ ఫౌండేషన్ సభ్యుడు గోపిశెట్టి సురేంద్ర కుమార్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.. ముందుగా బదురుల పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు అన్నసంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు.. విద్యార్థి విద్యార్థుల చేత కేక్ కటింగ్ కార్యక్రమం జరిగినది. అనంతరం విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ అన్న సంతత్పరణ ఫౌండేషన్ సభ్యులు నిర్వహించారు.. ఈ సందర్భంగా ఫౌండేషన్ సభ్యులు మాట్లాడుతూ; అఖండ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించామని నియోజకవర్గంలో ఆపదని ఎవరైనా వస్తే వారికి అన్నం ముద్దై ఆర్థికంగా ఆదుకుంటూ ఎన్నో సేవా కార్యక్రమాలను అఖండ ఫౌండేషన్ నిర్వహిస్తున్నారని వారు తెలిపారు.. అందులో భాగంగా సురేంద్ర కుమార్ జన్మదిన సందర్భంగా బదిరుల పాఠశాలలో అన్నసంతర్పణ చేయటం చాలా సంతోషం ఉందని అలాగే అతను ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని సుఖ సంతోషాలతో ఉండాలని వారు ఆకాంక్షించారు… ఈ కార్యక్రమంలో అఖండ ఫౌండేషన్ కార్యవర్గ సభ్యులు పి బాలకృష్ణ, గొర్ల ఆంజనేయ ప్రసాద్, పులిగడ్డ శ్యాం ప్రసాద్, బధిరుల పాఠశాల ప్రిన్సిపల్ , వార్డెన్, తదితరులు పాల్గొన్నారు…
