Wednesday, April 30, 2025
Homeఆంధ్రప్రదేశ్ఘనంగా బసవేశ్వర జయంతి వేడుకలు…

ఘనంగా బసవేశ్వర జయంతి వేడుకలు…

Listen to this article

ఆలయంలో పూజలు నిర్వహిస్తున్న దృశ్యం..

రుద్రూర్, ఏప్రిల్ 30 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) :

రుద్రూర్ మండలం సులేమాన్ నగర్ గ్రామంలోని శ్రీ స్వయంభు బసవేశ్వర ఆలయంలో బుధవారం బసవేశ్వర జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్వామివారికి రుద్రాభిషేకం, మంగళ హారతులు నిర్వహించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి పరమేశ్ మహారాజ్, ఆలయ కమిటీ సభ్యులు, మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments