
జన్మదిన వేడుకలను జరుపుకుంటున్న కాంగ్రెస్ నాయకులు…
రుద్రూర్ : (పయనించే సూర్యుడు రుద్రూర్ మండల ప్రతినిధి) మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంగణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. కేక్ కట్ చేసి ఒకరినొకరు పంచుకుంటూ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అంగన్ వాడి కేంద్రంలోని చిన్నారులకు బిస్కెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కర్క అశోక్, షేక్ నిస్సార్, ఇందూర్ కార్తీక్, జలీల్, కుర్మాజీ సాయిలు, డా. రఫిక్, చింతల శ్రీను తదితరులు పాల్గొన్నారు.