
{పయనించే సూర్యుడు} {న్యూస్ అక్టోబర్ 3}
ఈ రోజు నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలో అక్టోబర్ 2 మన భారతదేశ జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురష్కరించుకుని మక్తల్ జనసేనపార్టీ ఇంచార్జ్ డాక్టర్ మణికంఠ గౌడ్ అద్వర్యంలో మక్తల్లో మహాత్మాగాంధి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా మహాత్మాగాంది జన్మదిన వేడుకలు జనసైనికులు నిర్వహించడం జరిగింది డాక్టర్ మణికంఠ గౌడ్ మాట్లాడుతూ మన జాతిపిత మన దేశ స్వాతంత్ర్య ఉద్యమం లో ఎన్నో ఉద్యమాలు చేశారు ఉప్పు సత్యాగ్రహం చంపారన్ క్విట్ ఇండియా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉద్యమాలు శాంతి తోనే చేసి భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకరావడంలో ఆయన పాత్ర ఎంతో ఉంది సత్యం -అహింసా -శాంతి అనే నినాదం తో ముందుకు వెళ్లి భారతీయులందరినీ ఏకతాటి పైకి తెచ్చి ఉద్యమాన్ని ముందు ఉండి నడిపి బ్రిటిష్ వాళ్లను పారద్రోలి భారతదేశానికి స్వాతంత్ర్య సమరయోధులతో పాటు కలిసి స్వాతంత్ర్యం సంపాదించారు అలాంటి గొప్ప వ్యక్తి జన్మదినాన్ని మనమందరం పండగల జరుపుకోవాలని అందరికీ జనసేన తరపున దసరా శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో జనసైనికులు రామన్ గౌడ్ గౌడి బాల్ రెడ్డి శివప్రసాద్ భీమేష్ ఆంజనేయులు కృప సాగర్ శివ మరియు నర్సిములు తదితరులు పాల్గొన్నారు
