
పయనించే సూర్యుడు// న్యూస్ //మార్చ్ 8//మక్తల్ //రిపోర్టర్ సి. తిమ్మప్ప// తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం మక్తల్ మండల శాఖ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది.విద్య,వైద్య,శిశు సంక్షేమ,వెలుగు రంగాలకు చెందిన మహిళలను తపస్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మక్తల్ మండల విద్యాధికారి అనిల్ గౌడ్ మాట్లాడుతూ స్త్రీ అంటే ప్రకృతి ఇచ్చిన ప్రేరణకు మూలమని, తల్లిగా, భార్యగా, సోదరిగా, కూతురిగా జీవితంలోని ప్రతి దశలోనూ మగవాడిని నడిపించేది మహిళా అని, స్త్రీ ఉనికి లేనిదే జీవం లేదని, ప్రపంచంలోని ప్రతి విజయం వెనక ఒక బలమైన సాధికారత గల మహిళ ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మక్తల్ మండల గౌరవ అధ్యక్షులు నర్సిరెడ్డి, అధ్యక్ష కార్యదర్శులు రవీందర్, రాకేష్ కుమార్, కృష్ణ మండల అధ్యక్షులు నరసింహులు మరికల్ మండల ప్రధాన కార్యదర్శి శివశంకర్ సంఘ బాధ్యులు వెంకట్ రాములు,రాముగౌడ్, రాజగోపాల్, జగదీష్ ,అనిల్ రెడ్డి, శివరాజ్ ,సురేష్ మహిళా ఉపాధ్యాయులు సుభాషిని జ్ఞానేశ్వరి ,వీణ,సవిత ,తిరుమల ,సౌమ్య, శాంతలక్ష్మి,అనిత,శివజ్యోతి,ప్రతిభ,మహేశ్వరి, గీత,సౌమ్య మానస,స్వప్న,సుగుణ, సరిత,శాంత,పావని,ఏఎన్ ఎమ్ వెంకటేశ్వరమ్మ,అంగన్వాడీ టీచర్ విజయలక్ష్మి,ఆశ కార్యకర్తలు లావణ్య, లక్మి ,తదితరులు పాల్గొనడం జరిగింది.
