“సబ్ టైటిల్ “అట్టహాసంగా నిర్వహించిన వైఎస్సార్సీపీ శ్రేణులు
పయనించే సూర్యుడు జనవరి 13 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి)
ఆత్మకూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి జన్మదిన వేడుకలను వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని మేకపాటి క్యాంపు కార్యాలయం వద్ద భారీ కేక్ ను ఏర్పాటు చేసి కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి రాజకీయ వారుసునికి నియోజకవర్గ రాజకీయాల్లో వచ్చిన మేకపాటి విక్రమ్ రెడ్డి అనతి కాలంలోనే అందరి మన్ననలు పొందే విధంగా పాలన సాగించారని పేర్కొన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఆత్మకూరునియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ది చేయాలో ప్రజల ద్వారా చర్చించి మరి ప్రణాళికలు రూపొందించారని, వాటిలో కొన్నింటిని ఆచరణలోకి సైతం తీసుకొచ్చారన్నారు.
ప్రభుత్వ సహకారానికి తోడు ప్రైవేట్ భాగస్వామ్యం ఉంటే మరింత త్వరగా అభివృద్ది సాధించవచ్చుననే ఉద్దేశ్యంతోనే ఆత్మకూరు డెవలప్ మెంట్ ఫోరం ఏర్పాటు చేసి నియోజకవర్గంలో పలు అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. నియోజకవర్గాభివృద్దిలో తన పాత్రను సమర్థవంతంగా పోషించారని పేర్కొన్నారు.
ఆత్మకూరునియోజకవర్గంలో ప్రజల సమస్యల పరిష్కారంతో పాటు పార్టీని మరింత పటిష్టం చేసేలా ఆయన కార్యాచరణను రూపొందించారని, ఆయన ఆశయ సాధనకు తామంతా వెంట నడిచేందుకు సిద్దంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా భారీస్థాయిలో బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు