
అన్నకు రాఖీ కడుతున్న చెల్లెలు…
రుద్రూర్, ఆగస్టు 9 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి)
అన్నా చెల్లెలు, అక్క తమ్ముడు అనుబంధాలకు గుర్తుగా నిర్వహించుకునే పండగ రక్షాబంధన్. ఏటా శ్రావణ పౌర్ణమి రోజు రాఖి పండగ నిర్వహించుకుంటారు. రుద్రూర్ మండల కేంద్రంలో శనివారం రాఖీ పండుగ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. చెల్లెల్లు అన్నలకు, అక్కలు తమ్ముళ్లకు రాఖీ కడుతూ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.