
రుద్రూర్ లో సంబరాలు జరుపుకుంటున్న దృశ్యం..
.రుద్రూర్, జూన్ 24 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) :
రుద్రూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంగణంలో మంగళవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసి ఘనంగా రైతు భరోసా సంబురాలను నిర్వహించారు. అర్హులైన ప్రతి రైతుకు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా కల్పించినందుకు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. జూన్ 16 నుండి నేటి వరకు అర్హులైన ప్రతి రైతుకు 9వేల కోట్ల రూపాయలను 12 ఎకరాలకు చొప్పున రైతుల ఖాతాలో జమ చేయడం జరిగిందన్నారు. ఉచిత కరెంటు, రైతు భరోసా, రైతు బీమా, ఉచిత బస్సు సౌకర్యం, ఇందిరమ్మ ఇండ్లు ఇలా పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ఆదుకుంటున్నారని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు రైతు భరోసా కల్పించినందుకు హర్షం వ్యక్తం రైతు భరోసా సంబురాలు జరుపుకోవడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తోట అరుణ్ కుమార్, కాంగ్రెస్ అధ్యక్షులు ఇందూరు చంద్రశేఖర్, మాజీ జెడ్పిటిసి నారోజు గంగారం, కాంగ్రెస్ పార్టీ నాయకులు పత్తి రాము, షేక్ నిస్సార్, అక్కపల్లి నాగేందర్, కుర్మాజీ సాయిలు, నెరుగంటి బాలరాజ్, తోట సంగయ్య, సుదర్శన్ గౌడ్, ఇమ్రాన్, కర్క అశోక్, ఫురఖాన్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.