
పయనించే సూర్యుడు న్యూస్ // నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలం మార్చ్ 8 తేదీ నారాయణపేట జిల్లా కేంద్రంలోని యస్ ఆర్ గార్డెన్ లో శ్రీ సాయి స్కూల్ 30 వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మున్సిపల్ ఛైర్పర్సన్ గందె అనసూయ సరస్వతి చిత్రపటానికి పూజ చేసి ప్రారంభం చేశారు. ఈ సందర్భంగా ఛైర్పర్సన్ గందె అనసూయ,వక్త రవీంద్రనాథ్,బీజేపీ జిల్లా అధ్యక్షుడు సత్య యాదవ్ మాట్లాడుతూ విద్యార్థులు చక్కగా చదువుకొని భవిష్యత్ లో తల్లిదండ్రులు గర్వంగా చెప్పుకునే విధంగా గొప్ప ఉద్యోగాలు సాధించాలని అన్నారు.చదువుతో పాటు అన్ని రంగాలలో ఎదుగాలని తెలిపారు. శ్రీ సాయి స్కూల్ విద్యార్థులు చదువుతో పాటు సాంసృతిక కార్యక్రమాలు,క్విజ్,ఉపన్యాసం,వ్యాసరచన,నృత్యం,ఆటలు మరియు టాలెంట్ టెస్ట్ లలో చక్కగా ప్రదర్శన చేసి జిల్లా,రాష్ట్ర స్థాయిలో నారాయణ పేట జిల్లా కు పేరు ప్రఖ్యాతలు తెచ్చినందుకు అందరూ అభినందించారు. ఆ తర్వాత విద్యార్థుల నృత్యాలు చూపరులకు ఆనందాన్ని కలిగించాయి.పదవ తరగతి లో ఉత్తమ మార్కులు సాధించిన తల్లిదండ్రులను శాలువాతో సన్మానం చేశారు.కార్యక్రమంలో పాఠశాల నిర్వాహకులు శేషమ్మ,గోవర్ధన్ రెడ్డి,కవిత, సురేందర్ నాథ్, అడ్వైజర్స్ మురళీధర్ , భగవంత్ రెడ్డి,విజయ లక్ష్మి,మల్లేష్,కరస్పాండెంట్ సాయిలీల,ప్రిన్సిపాల్ బాలప్ప,హెచ్.నర్సింహా,సునీల్ రెడ్డి,హరీష్,ఉపాద్యాయులు,విద్యార్థులు,తల్లిదండ్రులు పాల్గొన్నారు.
