
రుద్రూర్, సెప్టెంబర్ 6 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) :
రుద్రూర్ గ్రామంలోని శ్రీ సార్వజనిక్ గణేష్ మండలి 75 వ వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించారు. శనివారం గణేష్ శోభాయాత్రను అంగరంగ వైభవంగా నిర్వహించారు. శివపార్వతుల వేషధారణ, భజనలు, కీర్తనలు, నృత్యాలు, నాసిక్ డోలక్ బ్యాండ్ ల మధ్య ప్రధాన వీధుల గుండా గణేష్ శోభయాత్ర కొనసాగింది. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి రాము శర్మ, గణేష్ మండలి అధ్యక్షులు చిదుర వీరేశం, గెంటిల సాయిలు, పత్తి రాము, గెంటిల గంగాధర్, పత్తి లక్ష్మణ్, కర్క అశోక్, గణేష్ మండలి సభ్యులు, యువకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
