రుద్రూర్, జనవరి 12 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) : రుద్రూర్ మండల కేంద్రంలోని బిజెపి పార్టీ కార్యాలయం వద్ద ఆదివారం బిజెపి నాయకులు, కార్యకర్తలు స్వామి వివేకానంద 163 వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి జయంతి వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా బిజెపి పార్టీ మండల అధ్యక్షులు ఆలంపాటి హరికృష్ణ మాట్లాడుతూ.. భారతీయ యువతకు స్ఫూర్తి ప్రదాత స్వామి వివేకానంద అని అన్నారు. ప్రతి యువత స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకుని ఆయన అడుగుజాడల్లో నడవాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ నాయకులు ప్రశాంత్ గౌడ్, పార్వతి మురళి, వడ్ల సాయినాథ్, గణేష్, అనిల్, రాజశేఖర్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.