▪ అలరించిన చిన్నారుల నృత్యం.
పయనించే సూర్యుడు జనవరి 26హుజురాబాద్ రూరల్ రిపోర్టర్ బండ శివానంద రెడ్డి
సెయింట్ థామస్ పాఠశాలలో 76వ గణతంత్ర దినోత్సవన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. పాఠశాల కరస్పాండెంట్ &ప్రిన్సిపాల్ ఫాదర్ శరన్ రెడ్డి జెండాను ఆవిష్కరించి దేశభక్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎందరో మహానుభావుల త్యాగాల వెలకట్టలేని బహుమతి ఈ గణతంత్ర దినోత్సవం అని అన్నారు. 1950 జనవరి 26న భారత ప్రభుత్వం రాజ్యాంగాన్ని దేశ పరిపాలనకు మార్చడానికి భారత గణతంత్ర దినోత్సవం అంటారు అని అన్నారు. ప్రతి వ్యక్తి బాధ్యతయుతంగా క్రమశిక్షణతో ఉండాలి అని తెలియజేశారు.మన దేశం పట్ల ప్రేమ కలిగి ఉండాలని విద్యార్థులకు గణతంత్ర దినోత్సవ ప్రాధాన్యతను వివరించి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.
ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు.
RELATED ARTICLES