పయనించే సూర్యుడు ,జనవరి 26,బూర్గంపాడు మండల రిపోర్టర్ పోతుగంటి రామ్ ప్రసాద్:- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ,బూర్గంపాడు మండల కేంద్రంలోని రెవిన్యూ కార్యాలయంలో76వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించిన బూర్గంపాడు తాసిల్దార్ ముజాహిద్.. ఈ సందర్భంగా పిల్లలు దేశ నాయకుల వేషధారణలో హాజరయ్యారు. జాతీయ గీతం ఆలపించి మువ్వన్నెల జెండాను ఆవిష్కరణ చేసిన తాసిల్దార్ ముజాహిద్, ఎంపీడీవో జమలారెడ్డి. అనంతరం తాసిల్దార్ ముజాహిద్, ఎంపీడీవో జమలా రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇల్లు ,రైతు భరోసా ,కొత్త రేషన్ కార్డులు ,రైతు ఆత్మీయ భరోసా పథకాలను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మండలంలోని సోంపల్లి గ్రామాన్ని మోడల్ విలేజ్ గా ప్రకటించి ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు చేతుల మీదుగా అందించనున్నట్టు తెలియజేశారు .అందరికీ 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, అఖిలపక్ష నాయకులు, గ్రామ ప్రజలు, పాఠశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు