పయనించే సూర్యుడు జనవరి 26 ఆదివారం గాజుల రామారం రిపోర్టర్: ఆడెపు సంతోష్ కుమార్ (మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా):- గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఢిల్లీ వరల్డ్ స్కూల్ చింతల్ లో ఘనంగా వేడుకలు జరిగాయి. ప్రధానోపాధ్యాయురాలు రమ్య జాతీయ పతాకాన్ని ఎగురవేసి అనంతరం ప్రతి సంవత్సరం జనవరి 26ను భారత గణతంత్ర దినోత్సవంగా జరుపుతారు. 1950 జనవరి 26న భారత ప్రభుత్వం రాజ్యాంగాన్ని దేశపరిపాలనకు మార్చడాన్ని భారత గణతంత్ర దినోత్సవం అంటారు.. ప్రతి వ్యక్తి బాధ్యతాయుతంగా క్రమశిక్షణతో ఉండాలి మనస్సులో స్వేచ్ఛ, మాటల్లో బలం, మన ఆత్మలో గర్వం మరియు మన దేశం పట్ల ప్రేమ కలిగి ఉండాలని విద్యార్థులకు గణతంత్ర వేడుక ప్రాధాన్యతను వివరించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాఠశాల సహాయక సిబ్బంది పాల్గొన్నారు.