తహసీల్దార్ కార్యాలయం వద్ద జాతీయ జెండాను ఎగురవేస్తున్న దృశ్యం…
రుద్రూర్, జనవరి 26 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) : రుద్రూర్ మండల కేంద్రంలోని గాంధీ చౌక్ వద్ద, గ్రామపంచాయతీ కార్యాలయం, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం, తహాసిల్దార్ కార్యాలయం, ఎంపీడీవో కార్యాలయం, అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో ఆదివారం 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తసిల్దార్ కార్యాలయం వద్ద తహాసిల్దార్ తారాబాయి, ఎంపీడివో కార్యాలయం వద్ద ఎంపీడివో సురేష్ బాబు జాతీయ జెండాను ఎగురవేసి గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో తహాసిల్దార్ తారాబాయి, ఎంపీడీవో సురేష్ బాబు, డిప్యూటీ తహాసిల్దార్ సురేందర్ నాయక్, మాజీ సర్పంచ్ ఇందూరి చంద్రశేఖర్, వివిధ శాఖల అధికారులు, పాఠశాల విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.