Monday, April 28, 2025
Homeఆంధ్రప్రదేశ్ఘన్ని బ్యాగుల కోసం రోడెక్కిన రైతులురాస్తారోకో

ఘన్ని బ్యాగుల కోసం రోడెక్కిన రైతులురాస్తారోకో

Listen to this article

గన్ని బ్యాగుల కోసంలైన్ కట్టిన రైతులు

పయనించే సూర్యుడు //న్యూస్ ఏప్రిల్ 28//మక్తల్ రిపోర్టర్ సీ తిమ్మప్ప//

మక్తల్: ఘన్ని బ్యాగులు కోసం సోమవారం సింగిల్ విండో కార్యాలంముందు. రైతులు క్యూ కట్టారు. ఇస్తామన్న సమయానికి గన్ని బ్యాగులు ఇవ్వకపోవడంతో విసుగు చెందిన రైతులు ఎండను లెక్క చేయకుండా రాయచూరు హైదరాబాద్ జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు.ఇరు వైపుల పలు వాహనాలు నిలిచిపోయి ఎండ వేడిమికి ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు, రాస్తారోకో స్థలానికి స్థానిక సీఐ రాంలాల్ మక్తల్ ఎస్సై చారి తన సిబ్బందితో సంఘటన స్థలానికి వచ్చి రైతులతో మాట్లాడి రాస్తారోకోని విరమింప చేశారు, మండలంలోని పలు గ్రామాల్లో వరి కోతలుపడిన ధాన్యాన్ని ఖరీదు చేస్తామని ధాన్యం ను పరిశీలించిన అధికారులు ఘన్ని బ్యాగుల కోసం స్లిప్పులుఇచ్చిన తేది ప్రకారం సోమవారం మక్తల్ పట్టణంలోసింగిల్ విండో కార్యాలయం వద్దా ఉదయం నుంచి రైతులు క్యువ్ కట్టారు. ఆదివారం అకాలంగా కురిసిన వర్షాలకు కల్లాల దగ్గర ఆరుబయట. కొనుగోలు కేంద్రాల దగ్గర. ఉంచిన దాన్యం తడిసిపోవడం తో దిగాలు పడిన రైతుల ఎలాగైనా తమ ధాన్యాలని బస్తాలకు నింపి పెడితే రవాణా జరిగెందుకు ఆలస్యమైన పర్వలేదని బావించిన రైతులు సింగిల్ విండో కార్యాలయం దగ్గరకు మండలంలోని రైతులు తరలిరావడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ గన్ని బ్యాగుల కోసం పడరాని పాట్లు పడుతున్నామని కృష్ణ మాగనూరు మక్తల్ మండలాల్లో సంగం బండ. కృష్ణ నది పరివాహకం. భూత్పూర్ రిజర్వాయర్ల కింద సాగునీరు పుష్కలంగా లభించడంతో పెద్ద మొత్తంలో రైతులు వరి పంటను సాగు చేశారు , సాగు వివరాల ప్రకారం పంట దిగుబడికి అనుగుణంగా వ్యవసాయ అధికారులు గన్ని బ్యాగులకోసం ప్రభుత్వానికి నివేదిక పంపాల్సి ఉండేదని కానీ ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికార్ల నిర్లక్ష్యం వల్లనే సమయానికి ఘన్ని బ్యాగులను రైతులకు సరఫరా చేయలేకపోతున్నారు, ప్రభుత్వ మద్దతు ధర ఇచ్చి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్న ధాన్యం పంట కోత పడే సమ యానికి రైతులకు గన్ని బ్యాగులు అందించాల్సి ఉంది.. పండించిన పంట అకాల వర్షాలకుదాన్యం తడిసిపోయి రంగు మారి తేమశాతం అధికంగా ఉందని కొనుగోలు కేంద్రాల వద్ద అధికారులు ఇబ్బంది పెడతారని భయంతో ఆర్థిక ఇబ్బంది తలెత్తుతాయని రైతులు అంటున్నారు. ఈప్రాంతంలో వరి ధాన్యం ఎంత మేర దిగుబడి వస్తుంది… ఎన్నిఘన్ని బ్యాగులు అవసరంముదో అని లెక్కలతో అందుకు తగ్గట్టు ముందస్తు చర్యలు ఎందుకు తీసుకోలేధని రైతులు ప్రశ్నించారు. ఈ ప్రాంతంలో వరి సాగు బడిప్రకారం ఐదు లక్షల ఘన్ని బ్యాగుల అవసరం ఉందని ఇప్పటివరకు లక్ష నరాఘన్ని బ్యాగులు వచ్చాయని ఈరోజు 25 వేల ఘన్ని బ్యాగులు వచ్చాయని మిగతావి రావాల్సి ఉందని ప్రభుత్వం నుండి వచ్చిన వాటిని సీరియల్ ప్రకారము రైతులకు ఘన్ని బ్యాగులు ఇస్తున్నామని రాజకీయ నాయకుల ఒత్తిడి వల్ల ఎవరికి ప్రాధాన్యత ఇవ్వడం లేదని రైతులకే ప్రాధాన్య ఇస్తున్నామని కోఆపరేటివ్ అధికారి రాములు వివరణ ఇచ్చారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments