
పయనించే సూర్యుడు ఏప్రిల్ 27 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి
తెలంగాణలో మరోసారి అవినీతి కలకలం రేపింది. కాలేశ్వరం ప్రాజెక్టు ఇంజినీరింగ్ చీఫ్ ఈఎన్సీ హరి రామ్‌పై అవినీతి నిరోధక శాఖ ఏసీబీ, అధికారులు అక్రమాస్తుల కేసు నమోదు చేసి, అతని ఇంటితో పాటు బంధువుల ఇళ్లలో పద ముడు చోట్ల భారీగా సోదాలు నిర్వహించారు. గజ్వెల్ లో ప్రారంభమైన ఈ దర్యాప్తు, హరి రామ్‌కు చెందిన ఆస్తులను గుర్తించడంలో కీలకమైన భాగం కావడమే కాక, ఆస్తుల విలువ కూడా ఆహ్లాదకరంగా ఉంది. ఈ సోదాలు షేక్‌పేట్, కొండాపూర్, శ్రీనగర్, నార్సింగి, మాదాపూర్ లోని విల్లాలు, ఫ్లాట్లు, ఏపీ అమ రావతిలోని కమర్షియల్ ఫ్లాట్‌లతో పాటు, మార్కూక్ మండలంలో ఇరవై ఎనిమిది ఎకరాల వ్యవసాయ భూమి, పఠాన్ చెరులో ఇరవై గుంటలు, శ్రీనగర్ లో రెండు ఇండిపెండెంట్ ఇండ్లను కూడా గుర్తించాయి.ఇక, బొమ్మల రామారంలో ఆరు ఎకరాల మామిడి తోట, ఫామ్ హౌస్, కొత్తగూడెం, కుబ్బులాపూర్, మిర్యాల గూడలో ఓపెన్ ప్లాట్లను కూడా అధికారులు గుర్తించారు.ఆయన వద్ద బీఎండబ్ల్యూ కార్, భారీగా బంగారు ఆభరణాలు, నగదు స్వాధీనం చేసుకున్నారు. పలు ఆస్తుల పేపర్లు, బ్యాంకు డిపాజిట్లు కూడా అధికారులు పట్టుబట్టారు. ఈఎన్సీ హరి రామ్‌ను అరెస్టు చేసి, అర్థరాత్రి జడ్జి ఇంట్లో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. పద్నాలుగు రోజుల రిమాండ్‌ను విధించిన అనంతరం, హరి రామ్‌ను చంచల్ గూడ జైలుకు తరలించారు. సోదాలు తెల్లవారుజామున రెండు గంటలకు ముగిసిన తర్వాత, ముడు గంటలకు జడ్జి ఇంట్లో హరి రామ్‌ను ప్రొడ్యూస్ చేయడం జరి గింది.ఏసీబీ అధికారులు హరి రామ్ పై కొనసాగించే దర్యాప్తును మరింతగా పెంచుతున్నారని తెలిపారు. ఇప్పటి వరకు గుర్తించిన ఆస్తుల విలువ సుమారుగా రూ.రెండువందల కోట్లు కాగా, వీటి బహిరంగ మార్కెట్ విలువ అధికారిక విలువ కంటే పది రెట్లు అధికంగా ఉందని వెల్లడించారు. ఈ దర్యాప్తులో షేక్‌పేట్, కొండాపూర్, మాధాపూర్, కోకాపేట్, సంజీవారెడ్డి నగర్, కుత్బుల్లాపూర్, యల్లారెడ్డిగూడ, పటాన్ చెరు, యాదగిరిగుట్ట, కొత్తగూడెం, మిర్యాలగూడ వంటి ప్రాంతాల్లో ఉన్న ఆస్తులను గుర్తించారు.