
ఆదోని టిడిపి ఇన్చార్జ్, మాజీ శాసనసభ్యులు మీనాక్షి నాయుడు
పయనించే సూర్యుడు జిల్లా ఇంచార్జ్ శ్రీకాంత్ (21: జనవరి) (ఆదోని నియోజకవర్గం)…. • ఉత్తరాంధ్రకే గాక యావత్ ఆంధ్రరాష్ట్రానికి మణిహారం విశాఖ కర్మాగారం. వేలదా మంది తెలుగోళ్ళు కలిసి విరోచిత పోరాటాలు, త్యాగాలు చేసి సాధించుకున్న సంస్థ విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుజ్జీవింపజేయడానికి ఎన్డీఏ ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తుంది.
• నాపై ఉన్న కేసుల నుంచి నాకు విముక్తి కల్పించండి, కావాలంటే మా రాష్ట్రాన్ని తాకట్టుపెడతానని సీఎంగా జగన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళేవాడు. నేడు అందుకు భిన్నంగా సీఎం చంద్రబాబు హస్తీనాకు వెళ్ళి వస్తున్నారు.• ముఖ్యమంత్రి చంద్రబాబు హస్తీన పర్యటనకు వెళ్ళి వచ్చిన ప్రతీసారి ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం గుడ్ న్యూస్ చెప్తునే ఉంది. నేడు ఆర్థిక సంక్షోభంలో పూడుకుపోయిన విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడేందుకు రూ.11,440 కోట్లు ఆర్థిక ప్యాకేజీని ఇచ్చేందుకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల క్యాబినేట్ కమిటీ ఆమోదముద్ర వేసింది.• విశాఖ ఉక్కును ప్రైవేటు పరం చేయాలి, ఉక్కు ఆస్తులను అమ్ముకోవాలని జగన్ రెడ్డి ప్రయత్నిస్తే విశాఖ ఉక్కును ఏ విధంగా పరిరక్షించాలని చంద్రబాబు ఆహర్నిశలు శ్రమిస్తున్నారు.• అప్పుడు నష్టాల్లో ఉన్నప్పుడు కాపాడింది… నేడు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో నుంచి స్టీల్ ప్లాంట్ను గట్టెక్కించింది చంద్రబాబు తప్పుడు కూతలతో వైసీపీ ఎంత దుష్ప్రచారం చేసినా వారి మాటలను వినే పరిస్థితుల్లో ప్రజలు లేరు.