Tuesday, July 22, 2025
Homeఆంధ్రప్రదేశ్చట్టి లో ఘనంగా విశ్వ కోయ భాషా దినోత్సవంముఖ్య అతిధిగా చింతూరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి...

చట్టి లో ఘనంగా విశ్వ కోయ భాషా దినోత్సవంముఖ్య అతిధిగా చింతూరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి అపూర్వ భరత్ ఐఏఎస్

Listen to this article

పయనించే సూర్యుడు రీపోటర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్ జులై ది. 21

అల్లూరి సీతరామరాజు జిల్లా చింతూరు లో ఆంధ్రప్రదేశ్ ఆదివాసి జెఎసి, చింతూరు డివిజన్ కమిటీ, చట్టి పెస కమిటీ ఆధ్వర్యంలోపొడియం రామకృష్ణ, జేఏసీ డివిజన్ చైర్మన్ జల్లి నరేష్,. నేత్రుత్వంలోముందు గా గ్రామ పూజారులు ద్వారా ఆదివాసీ ఉద్యమ కారులు కొమరం భీం,బిర్స్ ముండా ఫొటోలకు పూలమాలవేసి పూజ కార్యక్రమం చేసి ఆదివాసీ జెండా ఎగారావేయడం జరిగింది అనంతరం సభ చింతూరు ఐటిడిఎ ప్రాజెక్ట్ అధికారి అపూర్వ భరత్ ఐఎఎస్ ముఖ్య అతిధిగా హాజరై చట్టి లో చింతూరు డివిజన్ స్థాయిలో ఘనంగా 8 వ విశ్వ కోయ భాషా దినోత్సవం జరిగింది. ఈ సందర్బంగా జాతీయ కోయ భాషా ప్రామాణిక డిక్షనరీ కమిటీ సమన్వయకర్త మడివి నెహ్రూ మాట్లాడుతూ.. ఈ కోయ భాషా దినోత్సవం ఉద్దేశ్యం ఈ దేశ అత్యంత ప్రాచీన మూల తెగ ఐన కోయ సమాజం దేశంలో శువుషాలంగా విస్తరించిన కోయ భాషా అంతరించే ప్రమాదంలో ఉండడం ఉనికిని కోల్పోయే దుస్థితికి కారణం కోయ భాషా గుర్తింపు లేకపోవడం ప్రధాన కారణం అని అందుకే కోయ భాషకి 8 షెడ్యూల్ ప్రకారం భాషా గుర్తింవు లక్ష్యం తో మొదలు పెట్టడం జరిగిందని, అందుకు జాతీయ స్థాయిలో 2014 నుండి కృషి మొదలైందని 2017 లో ప్రామాణిక డిక్షనరి రూపొందించి కేంద్రప్రభుత్వానికి మరోసారి విన్నవించమని, అది ఇంకా ప్రభుత్వంలో పెండింగ్లో ఉందని ఈ సభా ముకంగా ప్రభుత్వాన్ని 8 వ షెడ్యూల్ ప్రకారం కోయ భాషా గుర్తింపు అనివార్యమని డిమాండ్ చేశారు. అలానే ప్రామాణిక వర్క్ షాపులు నిర్వహించి డిక్షనరీలో మరిన్ని పదాలు చేరేలా భాషా సంవరుద్ది పేరేగాలా సహకరించాలని, మాతృ భాషైన కోయ భాషలో ప్రాథమిక విద్యాని అందించాలని, కోయ భాషా టీచర్ల నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అనంతరం సానుకూలంగా స్పందించిన చింతూరు ఐటిడిఎ ప్రాజెక్ట్ అధికారి అపూర్వ భరత్ ఐఎఎస్ మాట్లాడుతూ 8 వ షెడ్యూలు ప్రకారం కోయ – గోండి భాషా గుర్తింపు కోసం ప్రభుత్వానికి మీ తరుపున కృషి చేస్తానని, ప్రామాణిక వర్క్ షాప్ లు నిర్వహించడానికి చింతూరు ఐటిడిఎ తప్పక సహకరిస్తామని, ప్రాథమిక విద్య కోయ భాషలో అందించేందుకు కృషిచేస్తామని, కోయ భాషా టీచర్ల నియామకం విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తామని హామీ ఇచ్చారు.తరువాత చట్టి గ్రామ పూజారులు లకు,పెద్దలకు శాలువా కప్పి సత్కరించారు ఈ కార్యక్రమంలో చింతూరు డివిజనలోని నాలుగు మండలాల ఆంధ్రప్రదేశ్ ఆదివాసి జెఎసి నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు. ఆదివాసీ జేఏసీ చైర్మన్ జల్లి.నరేష్,ఆదివాసీ గిరిజన సంఘము రాష్ట్ర నాయకులు సిసం.సురేష్ ఉద్యోగ తిమ్మా సాయి,ఆదివాసి సీనియర్ నాయకులు కుర్సం సుబ్బారావు, ఆత్రం నవీన్, తుర్రం రామయ్య, ఎపిఎజెఎసి రాష్ట్ర కార్యదర్శి కుంజా అనిల్, కూనవరం జెడ్పిటిసి గుజ్జా విజయ, ఆదివాసి ఉద్యోగ నాయకులు తిమ్మ సాయి, సోడె నారాయణ,తుర్రం.లక్ష్మయ్య,తుర్రం.రామయ్య, తోడెం దేశయ్య,ముచ్చిక.సింగయ్య, కణితి గణేష్,ఆదివాసీ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కాకా.సీతరామయ్య జేఏసీ ఎటపాక ఛైర్మెన్ కుంజా శ్రీనివాస్, చింతూరు ఎంపీపీ సవలం.అమల చట్టి సర్పంచ్ రవ్వ.భద్రమ్మ,,ఏ జి కోడేరు సర్పంచ్ బి.సుబ్బులక్ష్మి, నాయకులు పొడియం లక్ష్మణ్, వివిధ గ్రామాల పెద్దలు తుర్రం.రామయ్య,రవ్వ.ప్రసాద్, పూజారులు, ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments