
పయనించే సూర్యుడు ఫిబ్రవరి 19: మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా కెపిహెచ్బి కాలనీ ఒకటవ రోడ్ లో గల చత్రపతి శివాజీ విగ్రహాం దగ్గర చత్రపతి శివాజీ యువసేన అధ్యక్షుడు యోగేష్ ప్రభు నిర్వహించిన కార్యక్రమమునకు కూకట్ పల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు పాల్గొని చత్రపతి శివాజీ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకుడు కొల్లా శంకర్, ఎన్ . నాగేంద్రబాబు మాట్లాడుతు చత్రపతి శివాజీ పది హేడు ఏళ్ళ చిరుప్రాయంలోనే యుద్ధము చేసి , కోటలను గెలుస్తూ , మొగల్ సామ్రాజ్యం ఎదిరించి , వారి దురాగతాలను చరమ గీతం పాడి భారతదేశానికి మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించారని, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని పరిరక్షించుట, భారతదేశ ఐక్యత పవన్ కళ్యాణ్ పోరాటపటిమలొ చత్రపతి శివాజీ స్ఫూర్తి కూడ ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కూకట్పల్లి నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు వేముల మహేష్ , అడబాల షణ్ముఖ, పోలే బోయిన శ్రీనివాస్ , బలిజేపల్లి శంకర్రావు, గోపి , శ్రీను బాలాజీ తదితరులు పాల్గొన్నారు.