
పయనించే సూర్యుడు న్యూస్ 21 జనవరి సిరిసిల్ల టౌన్ రిపోర్టర్ బాలకృష్ణ
తెలంగాణ సాయుధ పోరాట యోధుడు కామ్రేడ్ బద్దం ఎల్లారెడ్డి 46వ వర్ధంతి సభను మండలంలోని రాళ్లపేట గ్రామంలో నిర్వహించారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి గుంటి వేణు మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటాన్ని ప్రారంభించిన అగ్రగన్యూల్లో కామ్రేడ్ బద్దం ఎల్లారెడ్డి ఒకరని తెలంగాణ సాయుధ పోరాటం మూలంగానే నైజాం సర్కార్ తెలంగాణ వదిలి పారిపోయాడని తెలంగాణ సాయుధరైతంగా పోరాటం ప్రపంచ చరిత్రలో లిఖించదగ్గ చరిత్ర.ముఖ్యంగా తెలంగాణ సాయుధ పోరాటంతోనె తెలంగాణకు స్వేచ్ఛ స్వతంత్ర కలిగిందన్నారు. అంతేకాకుండా బానిసత్వానికి వ్యతిరేకంగా ఎట్టిచాకిరి వ్యతిరేకంగా దోపిడీకి వ్యతిరేకంగా రజాకార్ల నైజాం భూస్వాముల దోరల దోపిడి, జమీందారుల దోపిడీ వ్యతిరేకంగా వందలాది దళాల నిర్మాణం చేసి సాయుధ పోరాటం నడపడం ద్వారానే 3000 గ్రామాలు విముక్తి చేయబడ్డాయి 4,500 మంది దళాలు దళ నాయకులు ఎంతో మంది తెలంగాణ కోసం అమరులయ్యారని, సాయుధ పోరాట త్యాగమూర్తులను త్యాగాలను చరిత్ర స్మరించుకునే విధంగా అమరుల కాంస్య విగ్రహాలను సిరిసిల్ల పట్టణంలో ఏర్పాటు చేయాలని కోరారు. మాదాపూర్ గుట్టల్లో అమరులైనటు వంటి 12 మంది సాయుధ పోరాట సభ్యులలో కామ్రేడ్ సింగిరెడ్డి భూపతి రెడ్డి ఒకరని గుర్తించుకోవడానికి సిరిసిల్ల నడిబొడ్డున స్మృతి వనము కాన్సె విగ్రహం ఏర్పాటు చేయాలని,బద్దం ఎల్లారెడ్డి ని కొనియాడుతూ వేలాదిమంది నిర్వాసితులుగా పేదలుగా ఉన్న వాళ్లకు ఇళ్ల స్థలాలు అందజేశారని ఆ వీధికి సిరిసిల్లలోని బివై నగర్ గా నామకరణం చేశారని తెలిపారు. ఈ వర్ధంతి సమావేశంలో తెలంగాణ సాయుధ పోరాటాన్ని ప్రారంభించిన పోరాట నాయకుల్లో కామ్రేడ్ బద్దం ఎల్లారెడ్డి ఒకరని తెలంగాణ సాయుధ పోరాటం మూలంగానే సాయుధ పోరాటానికి భయపడిన నైజాం సర్కార్ తెలంగాణ వదిలి పారిపోయాడన్నారు.
ఈ వర్ధంతి సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు, సిపిఐ మండల కార్యదర్శి సోమ నాగరాజు, సిపిఐ గ్రామ శాఖ అధ్యక్షులు సోమ నాగరాజు, రాజేందర్, బాల నర్సు,శంకర్, బాలమల్లు, పోచయ్య, కనకయ్య, బాలమల్లు, రాజేందర్, వెంకట్, గోవింద్, రాయమల్లు,శంకర్, కొమురయ్య,లక్ష్మయ్య, మురళి, బాలరాజు తదితరులు పాల్గొన్నారు