
పయనించే సూర్యుడు మే ఒకటి (పొనకంటి ఉపేందర్ రావు )
లక్ష్మీదేవి పల్లి మండలం చాతకొండ 6 వ బెటాలియన్ ను గురువారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సందర్శించారు. ఈ సందర్శన లో భాగంగా కలెక్టర్ నూతనంగా శిక్షణ పొందిన ఎస్ డి ఆర్ ఎఫ్ ( స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ) 100 మంది సభ్యులతో కూడిన బృందంతో ముచ్చటించి ఆపదల సమయంలో వారు చేపట్టే చర్యలను మరియు వారి వద్ద ఉన్న పరికరాలను పరిశీలించి వాటిని ఏ విధంగా ఉపయోగించాలో అడిగి తెలుసుకున్నారు. అనంతరం బెటాలియన్ లో నూతనంగా నిర్మించిన ఓపెన్ జిమ్ ను పరిశీలించి తగు సూచనలు చేశారు. బెటాలియన్లు నూతనంగా ఏర్పాటు చేసిన మట్టితో ఇటుకల తయారు (CSEB) యంత్రములు పరిశీలించి, ప్రయోగాత్మకంగా మట్టి ఇటుకలతో రోడ్డు తయారీ చేపట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. బెటాలియన్ అభివృద్ధి పనుల గురించి బెటాలియన్ అసిస్టెంట్ కమాండర్ అబ్దుల్ రషీద్ మరియు బెటాలియన్ ఉన్నత అధికారులతో కలెక్టర్ చర్చించి పలు సూచనలు చేశారు.