
పయనించే సూర్యుడు అక్టోబర్ 14 శర్వాస్ వలి మండల రిపోర్టర్ యాడికి
తాడిపత్రి శాసనసభ్యులు జె.సి. అష్మిత్ రెడ్డి తనయుని పుట్టినరోజు సందర్భంగా చవ్వా. అశ్వర్దమ్మ వృద్ధాశ్రమంలో అన్నదానం.యాడికి మండలం కోన రోడ్డులో గల చవ్యా. అశ్వర్దమ్మ వృద్ధాశ్రమంలో తాడిపత్రి శాసనసభ్యులు జె.సి. అష్మిత్ రెడ్డి గారి తనయుడు జె.సి. దీర్ దివాకర్ రెడ్డి జన్మదిన సందర్భంగా జె.సి. అభిమానులు, టీడీపీ నాయకులు వృద్ధుల చే కేక్ కటింగ్ చేయించి అనంతరం వృద్ధులకు చక్కటి మాంసాహార విందును ఏర్పాటు చేసినారు శాసనసభ్యులు జె.సి. అస్మిత్ రెడ్డి గారి తనయుడు జె.సి.ధీర్ దివాకర్ కు పెద్దల ఆశీస్సులు ఉండాలని ఎల్లవేళలా సంతోషంగా ఉండాలని పెద్దలకు అన్నదానం చేయడం జరిగింది అని అన్నారు.ఆశ్రమంలోని వృద్ధులు మాట్లాడుతూ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న తాడిపత్రి శాసనసభ్యులు జె.సి. అష్మిత్ రెడ్డి గారి తనయుడు తాతగారి కంటే, నాన్నగారి కంటే ఎన్నో ఉన్నతమైన శిఖరాలను అధిరోహించాలని, ధీర్ దివాకర్ రెడ్డి కు ఆయురారోగ్యాలతో అన్నివేళలా సంతోషంగా గడపాలని ఆశ్రమంలోని వృద్ధులు ఆ దేవున్ని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకులు బాలయ్య, రామ మోహన్, సత్య మరియు టీడీపీ నాయకులు మరియు జేసీ అభిమానులు విశ్వం, శుభాన్, రామచంద్ర,గుండా నారాయణ స్వామి, గన్నే రమేష్, మాయకుంట్ల నారాయణ స్వామి, పాండు, చాంద్ బాషా,రవి,శివ కోటి,రాజశేఖర్, కార్తీక్, చందు,వెంకటాద్రి పాల్గొన్నారు
