
గత పది రోజుల వ్యవధిలో వాముగడ్డ గ్రామంలో వరుసగా ముగ్గురు పసిపిల్లలు ప్రాణాలు కోల్పోవడం తెలిసిన విషయమే. అనారోగ్య కారణంగా ఒకరు ఊరిలోనే మరణించగా మరో ఇద్దరు పిల్లలు విశాఖపట్నం కేజీహెచ్ లో చికిత్స పొందుతూ మరణించారు. విషయం తెలుసుకున్న జనసేన నాయకులు వాముగడ్డ గ్రామానికి చేరుకొని బాధిత కుటుంబాలకు పరామర్శించి మనోధైర్యాన్ని ఇచ్చి మరణాలకు గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. కచ్చితంగా వాముగడ్డ గ్రామానికి మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసి వాముగడ్డ గ్రామ ప్రజలతోపాటు చుట్టుపక్కల ప్రజలకు కూడా వైద్య పరీక్షలు నిర్వహించేలాగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలోచింతపల్లి మండల. జనసేన పార్టీ మండల ఉపాధ్యక్షులు,కిముడు,కృష్ణమూర్తి.సూర్ల, వీరేంద్ర. గాజుల,శ్రీను, యూత్ అధ్యక్షులు,కొర్ర కృష్ణ.సీనియర్ నాయకులు, పొట్టుకోరి. జయరాజ్.సీనియర్ నాయకులు. జీకే వీధి మండల నాయకులు.సోషల్ మీడియా ఇంచార్జ్ కొయ్యం ఇమ్మానుయేల్. సీనియర్ నాయకులు, కూడా మధు, యూత్ అధ్యక్షులు పాంగి చంటిబాబు తతితరులు పాల్గున్నారు.