
పయనించే సూర్యుడు రిపోర్టర్ జనరల్ నరేష్ చింతూరు డివిజన్ ఇన్చార్జ్ మే 28 అల్లూరి సీతారామరాజు
జిల్లా చింతూరు మండలంలో గంజాయి ఇద్దరు వ్యక్తులఅరెస్ట్ చింతూరు () అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ శ్రీ అమిత్ బర్డర్ ips, చింతూరు అడిషనల్ ఎస్పి శ్రీ పంకజ్ కుమార్ మీనా ఆదేశాల మేరకు గంజాయి అక్రమ రవాణా పై ఉక్కుపాదం మోపారు. ఈ మేరకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అన్ని పోలీస్ స్టేషన్ల ను అప్రమత్తం చేశారు. ఈ మేరకు చింతూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ టీ. దుర్గా ప్రసాద్ గారి ఆధ్వర్యంలో చింతూరు బస్ స్టేషన్ లో తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానితులు ఇద్దరిని ఎస్ఐ రమేష్ పట్టుకున్నారు. చింతూరు బస్టాండ్ లో మంగళవారం రవాణా చేయడానికి సిద్ధంగా ఉన్న గంజాయితోపాటు, ఇద్దరు అనుమానిత వ్యక్తులను చింతూరు ఎస్ఐ రమేష్ సోదా చేసి ప్రశ్నించగా సంచుల్లో ఉన్న 30 కేజీల గంజాయి ని స్వాధీనం చేసుకున్నారు. వారి వద్ద ఉన్న మొబైల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ గంజాయి విలువ 1,50,000 ఉంటుందని తెలిపారు. ఈ కేసులో చిత్తూరు జిల్లాకు చెందిన గుండ్ల ఘటం రవిచంద్రన్ విజయ్, కండిగ రాజశేఖర్ లను అరెస్ట్ చేశారు. చింతూరు ఎమ్మార్వో చిట్టిబాబు, వీఆర్ఓ సోడే సుబ్బారావు, సుజాత సమక్షంలో పంచనామా నిర్వహించారు. నిందితులపై యన్ డి పీసీ యాక్ట ప్రకారం కేసు నమోదు చేసి , అనంతరం నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచినట్లు తెలిపారు. ఈ సందర్బంగా గంజాయి కలిగి ఉండటం, ఉపయోగించటం, వ్యాపారం చేయటం, రవాణా చేయటం చట్టరీత్యా నేరమని, యువత గంజాయి జోలికి వెళ్ళవద్దని చింతూరు అడిషనల్ ఎస్ పి గారు ఒక ప్రకటనలో తెలిపారు.
