
పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జి అక్టోబర్ 5
ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సేవలో పథకం ప్రారంభ సందర్భంగా ప్రతి ఆటో డ్రైవర్ కు ₹15000/- బ్యాంక్ ఖాతా జమ అయిన సందర్బంగా చింతూరు ఆటో యూనియన్ ఆధ్వర్యంలో చింతూరు ప్రధాన కూడలి నందు కూటమి నాయకులైన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్,బిజెపి రాష్ట్ర అధ్యక్షులు మాధవన్ చిత్రపటాలకు పాలాభిషేకం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు కట్ట శంకర్, నాగేశ్వరరావు,మురళి, ఫాతే అహ్మద్,చంద్రం,తెలుగు దేశం మాజీ మండల అధ్యక్షులు ఇల్లా చిన్న రెడ్డి, కో క్లస్టర్ ఇంచార్జి పొదిలా రామారావు, సీనియర్ నాయకులు ఆసిఫ్, వాస శ్రీరాంరెడ్డి నూక చారి, సాయి బాబా, యూనిట్ ఇంచార్జ్ శీలం తమ్మయ్య, సోడి సత్యవతి, కారం అచ్చమ్మ,నాగమణి
బీజేపీ మండల అధ్యక్షులు లక్ష్మయ్య రాజు, జనసేన నాయకులు తీగల రవి, కారం దుర్గ రావు తదితరులు పాల్గున్నారు.
