
పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇన్చార్జి సెప్టెంబర్ 6
చింతూరు మండలం చింతూరు గ్రామం అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ దిశా నిర్దేశాల ప్రకారం గత కొంతకాలంగా గంజాయి అక్రమ రవాణాను అరికట్టేందుకు ఏజెన్సీలోని అన్ని పోలీస్ స్టేషన్ ఎదుట రాత్రి పగలు వాహనాలు తనిఖీ చేస్తున్నప్పటికీ గంజాయి స్మగ్లింగ్ దారులు తరలించడానికి అనేక మార్గాలు ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలో జిల్లా ఎస్పీ తనిఖీల నిర్వహణ వ్యూహాత్మకంగా చేయవలసిందిగా ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. వారి ఆదేశాల ప్రకారం శనివారం రోజు ది. 06.09.2025 న తనిఖీ చేసే క్రమంలో చింతూరు పోలీస్ స్టేషన్ పరిధిలో చింతూరు అడిషనల్ ఎస్పీ పంకాజ్ కుమార్ మీనా వారి పర్యవేక్షణలో చింతూరు సి ఐ, సి.హెచ్ గోపాలకృష్ణ, ఎస్ ఐ, పి రమేష్ మరియు వారి సిబ్బందితో ఆర్టీసీ బస్టాండ్ వద్ద చేపట్టిన రైడ్ లో అక్రమంగా తరలిస్తున్న 25 కేజీల గంజాయిని పట్టుకోవడం జరిగింది. దీని విలువ సుమారు 1,25,000/- రూపాయలుగా గుర్తించారు. అక్రమ రవాణా దారులు ఒరిస్సా రాష్ట్రం నుండి హైదరాబాద్ తెలంగాణకు తరలిస్తుండగా, 25 కేజీల గంజాయిని, సెల్ ఫోన్ ను స్వాదినపరుచుకుని అతనిని అరెస్టు చేయడం జరిగింది.