
పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ ఆగస్టు 21
చింతూరు ఆసుపత్రి ని 100 పడకల ఆసుపత్రి గా అప్గ్రేడ్ చేయించడం లో కృషి చేసిన గౌరవ ఎమ్మెల్యే శ్రీమతి మిరియాల శిరీష దేవి విజయభాస్కర్ గార్కి,గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, ఆరోగ్యశాఖ మంత్రివర్యులుకు సత్య కుమార్ యాదవ్ గార్కి ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు శీలం తమయ్య, కారం సత్యవతి ధన్యవాదములు తెలియ చేశారు, 2018లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిచే 30 పడకల ఆసుపత్రిగా ప్రారంభించి నేడు చింతూరు డివిజన్ ప్రజలకు సేవలు అందిస్తూ వంద పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ అయిన సందర్భంగా మాజీ తెలుగుదేశం అధ్యక్షులు ఇల్లా చిన్న రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. చింతూరు డివిజన్ అభివృద్ధి చేయడంలో తెలుగుదేశం పాత్ర చాలా కీలకమైంది అని రాబోయే రోజుల్లో కూడా చింతూరు డివిజన్ ను మరింత అభివృద్ధి చేయడంలో తెలుగుదేశం పార్టీ ముందుంటుందని గౌరవ ఎమ్మెల్యే శిరీష దేవి విజయభాస్కర్ గారి నాయకత్వంలో రంపచోడవరం నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో సీనియర్ తెలుగుదేశం నాయకులు ఎస్. ఏ ఆసిఫ్ తదితరులు పాల్గొన్నారు