
చిడుమూరు పంచాయతీ పాలగూడెం బీటీ రోడ్డును మొదలు చేపట్టాలి చిడుమూరు సర్పంచ్ కాక అరుణకుమారి
పయనించే సూర్యుడు రీపోటర్ జల్లి నరేష్ డివిజన్ ఇంచార్జి మే 21
అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం చింతూరు మండలం చిడుమూరు గ్రామపంచాయతీలో గల పాలగూడెం గ్రామంలో సుమారుగా శంకుస్థాపన చేసి సంవత్సరం అయినా,, వెట్ మిక్సీ వేసి వదిలేశారు, పాలగూడెం గ్రామస్తులు సర్పంచ్ కి విషయం చెప్పగా చిడుమూరు సర్పంచ్ కాక అరుణకుమారి నేరుగా వెళ్లి ఆ రోడ్డును పరిశీలించడం జరిగింది. అలాగే ఈ రోడ్డు శంకుస్థాపన చేసి సంవత్సరమైన ఇంతవరకు మొదలుపెట్టలేదు ఇది ప్రభుత్వ యంత్రాంగం వైపల్యమా? లేక కాంట్రాక్టర్స్ వైపల్యమా అని సర్పంచ్ మాట్లాడ్డం జరిగింది. అలాగే పాలగుడెం గ్రామస్తులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని వెట్ మిక్సి రాళ్లు పైకి లేచి ఉండడం వలన టూ వీలర్, ఆటోలు, తిరగడానికి వీలు లేకుండా ఉంది వాహనదారులు పడుతున్నారు, అలాగే ఎమర్జెన్సీ వెళ్లడానికి కూడా వీలు లేకుండా ఈ రహదారి గందరగోళంగా ఉండడం వలన ప్రజలకు చాలా ఇబ్బందిగా ఉంది, ఇంకా వర్షాకాలం వస్తే చాలా ఇబ్బంది పడవలసి వస్తుందని సర్పంచి వివరించడం జరిగింది. ఇప్పటికైనా స్పందించి ఈ రహదారిని మొదలుపెట్టాలని ప్రభుత్వ పెద్దలను అలాగే చింతూరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిని కూడా ఈ ప్రకటన ద్వారా విన్నవించుచున్నాను అలాగే ఈ రోడ్డు పన్నులను వెంటనే మొదలు పెట్టాలని చిరుమూరు సర్పంచ్ కాక అరుణకుమారి పత్రిక ప్రకటన ద్వారా దీనికి సంబంధించిన అధికారులు వెంటనే స్పందించి పాలగూడెం గ్రామస్తులకు రోడ్డును మొదలుపెట్టి సంపూర్ణంగా పూర్తి చేయాలని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.
