Sunday, April 6, 2025
Homeఆంధ్రప్రదేశ్చింతూరు ఏజెన్సీ లో మొదటి ఆదివాసీ పెళ్లి, సాంప్రదాయ సంబరాలు

చింతూరు ఏజెన్సీ లో మొదటి ఆదివాసీ పెళ్లి, సాంప్రదాయ సంబరాలు

Listen to this article

పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్

చింతూరు ఏజెన్సీ లో మొదటి ఆదివాసీ పెళ్లి, సాంప్రదాయ సంబరాలు * పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్

అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం చింతూరు మండలం చిడుమూరు పంచాయతీ నరసింహపురం గ్రామంలో ఆనాటి పూర్వికులు చూపిన బాటలో సాంప్రదాయబద్ధంగా అందుకున్న ఏజెన్సీ గ్రామాల్లో గ్రామ పూజారి, పటేల్ ఆధ్వర్యంలో సాంప్రదాయ పెళ్లిళ్లు ఊపు అందుకున్నాయి, అలాగే గ్రామ పూజారి, పటేల్, ఎపర్, గ్రామస్తులు కులం చెంత పెళ్లి పనులు నిశ్చయించడం జరిగింది. ఊర్లో కుల పెద్దల సమక్షంలో సాంప్రదాయబద్దంగా ఆదివాసి ప్రాంతాలలో పూర్వికులు చూపిన దారిలో నరసింహపురం గ్రామంలో గ్రామ పూజారి పెద్ద పటేల్ ఆధ్వర్యంలో ఈరోజు పెళ్లి పందిరి పనులు మొదలు పెడితె అప్పటి నుండి పెళ్లి పనులు మొదలు ఆవుతాయి అలాగే నరసింహాపురంలో ఈరోజు పెళ్లి ముహూర్తం ఉండడం వలన గ్రామ పూజారి గ్రామ పటేల్ గ్రామస్తులకు ఒక్కరోజు ముందే పెళ్లి తాలుక వాళ్ళు గ్రామ పూజారికి పటేల్కి సమాచారం ఇవ్వడం జరుగుతుంది అప్పుడు ఊర్లో వాళ్ళకి గ్రామ పూజారి పట్టేలు ఊర్లో ఉన్న తలారికి చెప్పడం జరుగుతుంది, అప్పుడు ఆ తలారి ఊర్లో మొత్తం తిరిగి సమాచారం చెప్పడం జరుగుతుంది గ్రామస్తులు గ్రామ పూజారి ఆధ్వర్యంలో అప్పుడు ఫలానా తారీకు అని మాట్లాడటం జరుగుతుంది. అప్పుడు పలానా రోజు పెళ్లి అని నిర్ణయించడం జరుగుతుంది. అప్పుడు గ్రామ పూజారి ఆధ్వర్యంలో గ్రామస్తులంతా పనులు మొదలు పెట్టడం జరుగుతుంది, ఒకరోజు పందిరి ముహూర్తం మొదలుపెడతం జరుగుతుంది. పందిరి ముహూర్తంలో మేనమామ చేయవలసిన పనులు మొదటగా పెళ్లికూతురు,, మేనమామ,, అడవికి వెళ్లి ముహూర్తం గుంజే పట్టుకొని రావాలి మేనమామ ఆ గుంజుకి మేనమామ శుభ్రం చేయాలి, మేనమామ గొయ్యి తీయాలి ఆయనే తొమ్మిది రకాల నవధాన్యాలు( విత్తనాలు పెసర్లు, మినుములు, నువ్వులు, జొన్నలు, ఒడ్లు,బొబ్బర్లు, కంది,)అనేక రకాల విత్తనాలు పసుపు మొత్తం కలిపి తెల్లటి టవల్ దెగ్గర కట్టి, తెలటి దారం దెగర రావి ఆకులు, మామిడి ఆకులు తోరణలు కట్టి ఆ ముహూర్తం గుంజకి మేనమామ పూజారి ఈ పూజలు చేసిన తర్వాత గ్రామస్తులు పందిరి వేయటం జరుగుతుంది. ఈ ఆదివాసి ప్రాంతాలలో ఎటువంటి చిన్న పెద్ద విభేదాలు లేకుండా కులంకశంతో సంతోషంగా ఆదివాసి సాంప్రదాయ పూజారి పటేల్ ఆధ్వర్యంలో ఈ పెళ్లిలు నిర్వహిస్తారు, అలాగే కులం మొత్తం పందిరి పనులు చేరవేగంగా మొదలు పెడతారు గ్రామస్తులంటేనే కులం కులం అంటే గ్రామస్తులు అని కూడా అంటారు, గ్రామ పూజారి అధ్యక్షతన గ్రామస్తులు నడుచుకుంటారు ఆదివాసి బిడ్డలకు పూర్వం నుండి సాంప్రదాయంగా వస్తున్నటువంటి సాంప్రదాయం అది ఏజెన్సీ మండలం చింతూరు నరసింహపురం గ్రామంలో గ్రామ పూజారు, పటేల్, ఏఫర్, పిన్న పెద్ద ఈ నలుగురు ఆధ్వర్యంలో ఆ గ్రామంలో గ్రామస్తులంతా నడుచుకుంటారు అలాగే ఈనెల 11 వ తారీఖున నరసింహపురంలో పెళ్లి జరగబోయే పెళ్లికి గ్రామ పూజారి ఈరోజు పనులు మొదలుపెట్టడం జరిగింది. కార్యక్రమంలో గ్రామ పూజారి, గ్రామ పటేల్, ఏ ఫర్, పిన్ని పెద్ద, గ్రామస్తులు, కొమరం భీమ్ యూత్ కమిటీ సభ్యులు పాల్గొనడం జరిగింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments