
ముంపు మండలాల ప్రజలు ప్రభుత్వo పోలవరం నష్టపరిహారాన్ని అందించి పునరావాస కేంద్రాలకు తరలించాలని కోరారు
పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ సెప్టెంబర్ 1
అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం చింతూరు చ డివిజన్ వీలిన మండలాలను ప్రభుత్వ యంత్రాంగం ఏ మాత్రం పట్టించకపోవడంతో పాటు ఎటువంటి అత్యవసర సరుకులు కూడా ఇవ్వలేదు.. అలాగే వీలిన మండలాల్లో 86 గ్రామాలు జలదిగ్బంధంలో ఉన్నాయి..అలాగే ఈ 86 గ్రామాల కు ఎటువంటి సహాయ సహకారాలు ఇప్పటివరకు అందలేదు, కనీసం స్థానిక ఎమ్మెల్యే గారు కూడా జలదిగ్బంధంలో వున్న వరద గ్రామాలను నేటివరకు సందర్శించ లేదు. ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు అన్ని గ్రామాలను సందర్శించి తక్షణమే అందరికీ నిత్యవసర సరుకులు మరియు ఆర్థిక సహాయం ఇప్పించి విలీన ప్రజలు కోరుకుంటున్నారు అలాగే వరద గ్రామాలలో ధైర్యాన్ని ఇవ్వాలని..ఈ ముంపుకు గురైనటువంటి గ్రామాల ప్రజానీకం గందరగోళం లో ఉన్నారు, వి ఆర్ పురం, ఎటపాక, కూనవరం, చింతూరు వీలిన మండలాల ప్రజలు అయోమయ పరిస్థితితు ల లో ఉన్నారు.. ముంపు ప్రజలకు ప్రభుత్వ అధికారులు తక్షణమే స్పందించి ప్రభుత్వ అధికారులు సరుకులు, టార్పాలిన్లు, దోమతెరలు అందించాలని ఇండ్లలో నీరు చేరిన చేరకపోయినా బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయిన అన్ని గ్రామాలకు ప్రతి కుటుంబానికి ఆర్థిక సహాయం చేయాలని, పెండ్లి అయ్యి రేషన్ కార్డు లేనటువంటి వారందరినీ కూడా కుటుంబముగా పరిగణిస్తూ వారికి కూడా ఆర్థిక సహాయం చేయాలనిఅదేవిదంగా పోలవరం నిర్వాసితులకు మాకు ప్రతి సంవత్సరం ఈ వరదల్లో మా కష్టాలు వర్ణాతీతంగా ఉన్నాయని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మా పోలవరం ముంపు గ్రామాలకు ప్రభుత్వం వారు తక్షణం పోలవరం నష్ట పరిహారం అందించి మాకు న్యాయం చెయ్యాలి అదేవిధంగా మాకు పునరావాస కేంద్రాలకు తరలించాలని చెప్పి ముంపు ప్రజలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు

