
పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ ఆగస్టు 15
చింతూరు మండలం చింతూరు గ్రామపంచాయతీ కార్యాలయం నందు గౌరవ సర్పంచ్ కారం కన్నా రావు గారు అధ్యక్షతన 79 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను జాతీయ జెండా ఆవిష్కరణ చేసి ఘనంగా నిర్వహించడం జరిగింది అనంతరం కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులు అనుసరించి గ్రామపంచాయతీ కార్యదర్శి సిహెచ్ గంగరాజు మాట్లాడుతూ 1.పునరుత్పాదన ఇంధన పథకం మరియు 2.పశుసంవర్ధక శాఖ తోడ్పాటుతో కుక్కలకు కుటుంబ నియంత్రణ 3.గ్రామపంచాయతీ అభివృద్ధి ప్రణాళిక అంశాలను ప్రత్యేక గ్రామసభ సమావేశం ఏర్పాటు చేసి ప్రజలకు వివరించారు అనంతరం చింతూరు గ్రామపంచాయతీ పరిధిలో ఎంతగానో పారిశుధ్య సేవలు అందిస్తున్న, పారిశుద్ధ్య కార్మికులకు సిబ్బందిని స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా వారి సేవలకు గుర్తుగా సాలువతో సత్కరించి బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమం నందు చింతూరు మండల ఎంపీపీ సవలం అమల, ఎంపీటీసీలు ఎం. శ్రీ సుధాకర్, టి. ముత్తమ్మ వార్డు మెంబర్లు మరియు పీసా కమిటీ సభ్యులు సచివాలయ ఉద్యోగులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు
