
ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజ.శ్రీను డిమాండ్
పయనించే సూర్యుడు రీపోటర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జి ఆగష్టు 12
చింతూరులోని సిల్వర్ జూబ్లీ పార్కుగా పిలవబడే అటవీ శాఖ భూమిని నాన్ ట్రైబల్స్ ఆక్రమించి అక్రమ కట్టడాలు కట్టి వ్యాపారాలు చేస్తున్నారని ఫిర్యాదు చేసి మూడు నెలలు గడుస్తున్నా చింతూరు డిఎఫ్ఓ ఎటువంటి చర్యలు తీసుకోక పోవడంతో ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా శ్రీను మెయిల్ ద్వారా చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ రాజమండ్రి వారికి అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ మంగళగిరి వారికి మెయిల్ ద్వారా ఫిర్యాదు చేసినట్లు మంగళవారం నాడు ఆయన ప్రకటనలో తెలియజేశారు. అటివిశాఖ భూములు పరిరక్షించడంలో చింతూరు డిఎఫ్ఓ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందని, అంతేకాక అటవీ శాఖ భూమిలో స్థిర నివాసాలు వ్యాపార దుకాణాలు పెట్టుకున్న నాన్ ట్రైబల్స్ కి అటవీ శాఖ వాళ్ళు వత్తాసు పలుకుతూ వారికి అండగా ఉంటున్నారని ఈ సందర్భంగా ఆయన మండిపడ్డారు. ఫిర్యాదు చేసి నెలలు గడుస్తున్న చర్యలు తీసుకోవడానికి ఎందుకు వెనకాడుతున్నారు అర్థం కావటం లేదని, ఇలాంటి ఫిర్యాదు ఆదివాసుల మీద వస్తే ఇదే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారా వెంటనే వెళ్లి ఆదివాసీల గుడిసెలు నిర్ధాక్షణంగా కూల్చి వేయరా అని ప్రశ్నించారు. చింతూరు ఏజెన్సీ ప్రాంతాల్లో అట్టివిశాఖ వాళ్ళు ట్రైబల్స్ ఒక విధంగా, నాన్ ట్రైబల్ కు ఒక విధంగా నడుచుకుంటున్నారని, అటవీ శాఖ భూముల్లో ఎన్ని అక్రమాలు చేస్తున్న ముడుపులు తీసుకొని చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. సి సి ఎఫ్ మరియు పిసిసిఎఫ్ వారు కూడా దీనిపై స్పందించకుంటే డైరెక్ట్ గా చింతూరు డిఎఫ్ మరియు అటవి శాఖ సిబ్బందిపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసు వేస్తామని హెచ్చరించారు. ఇటువంటి ఫారెస్ట్ అధికారుల వలన అడిగి అంతరిస్తుంది తప్ప అడవి రక్షించబడదని, అలాగే అడవి శాఖ భూములు నాన్ ట్రైబల్ కబ్జాలలో ఉండిపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు