
పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ జులై 1
చింతూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేసి విద్యార్థులకు తరగతి గదులు నిర్వహణ చేపట్టాలని నిర్మాణంలో ఉన్న డిగ్రీ కళాశాలను పరిశీలించిన గిరిజన సంఘం బృందం రాష్ట్ర కమిటీ సభ్యులు సీసం సురేష్ డిమాండ్ డిమాండ్ చేశారు మంగళవారం నాడు గిరిజన సంఘం జిల్లా బృందం చింతూరు కేంద్రంలో నిర్మాణంలో ఉన్న డిగ్రీ కళాశాల భవనాన్ని సందర్శించడం జరిగినది, ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ సభ్యులు సిసం సురేష్ మాట్లాడుతూ 8 ఏళ్ల క్రితం ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించగా నిర్మాణం అస్తవ్యస్తంగా అరకు కొరా నిధులు కేటాయింపుతో ప్రభుత్వాలు మారుతున్న నిర్మాణం పూర్తి కాకుండా నేటికీ అసంపూర్ణంగానే ఉందని నేటికీ గోడల నిర్మాణం స్లాబు మినహాయిస్తే ఇంకా ఏమి పనులు పూర్తి కాలేదని ఇంకా అనేక నిర్మాణ పనులు, విద్యుత్తు,పెయింటింగ్, టైల్స్, విద్యార్థులకు అవసరమైనటువంటి టాయిలెట్స్ కళాశాల ప్రహరీ ఏ పనులు కూడా చేపట్టలేదని నేటికీ నిర్మాణంలో ఉన్నకళాశాల మొత్తం అస్తవ్యస్తంగా అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా ఉందని గత ప్రభుత్వం ఐదేళ్ల కాలంగా నిర్మాణాన్ని దృష్టి పెట్టకపోవడం వల్ల నేటికీ విద్యార్థులు జూనియర్ కళాశాలలో ఒక్క పూట తరగతుల 8 ఏళ్లుగా నిర్వహణతో విద్యార్థుల విలువైన సమయాన్ని వృధా అయ్యిందని తక్షణమే కళాశాల నిర్మాణం పూర్తి చేయాలని అంతేకాకుండా కళాశాలకు అదనపు గదులు మరియు సైన్సు కంప్యూటర్ ల్యాబ్స్ కు సంబంధించినటువంటి అనేక భవన నిర్మాణాలను ప్రభుత్వం చేపట్టాల్సిన అవసరం ఉందని తక్షణమే ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవన నిర్మాణాన్ని పూర్తి చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం మండల కార్యదర్శి కారం నాగేష్, మొట్టమ్ రాజయ్య,ధర్మల వీరభద్రం, సోడే లెనిన్, షోడే రాజయ్య, పోచం వీరయ్య, తదితరులు పాల్గొన్నారు