
పయనించే సూర్యుడు రిపోర్టర్ జర్నీ నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ జులై 30
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలానికి భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడిగా ఆదివాసీ బిడ్డా బట్ట లక్ష్మయ్య రాజు ను జిల్లా అధ్యక్షురాలు మఠం. శాంత కుమారి గారు నియమించి ఆ నియామక పత్రం అందజేయడంతోపాటు త్వరగా మండల కమిటీ బూత్ కమిటీలు శక్తి కేంద్ర ప్రముఖులు నియమించాలని వారు తెలియజేశారు. అందరూ సష్టిగా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న పథకాలను ప్రజలకు తెలియజేయాలని కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని వారు తెలియజేశారు.అదేవిదంగా మండలంలోని బీజేపీ కార్యకర్తలు కూడా హర్షం వ్యక్తం చేసారు