
పయనించే సూర్యుడు రీపోటర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జి ఆగష్టు 13
పార్టీలో కష్టపడ్డ ప్రతీ కార్యకర్తకి సముచిత స్థానం ఖచ్చితంగా ఉంటుందని రంపచోడవరం ఎమ్మెల్యే, రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్మన్ ఎం శిరీష దేవి విజయ్ భాస్కర్ అన్నారు. మండలం లో స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గం పార్టీ పరిశీలకులు కొల్లుబోయిన శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక సంస్థాగత ఎన్నికలు కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఆమె మాటాడుతూ పార్టీలో నిబద్దత, క్రమశిక్షణతో ఉండాలని కోరారు. అలాంటి కార్యకర్తలకు పార్టీ ఎప్పుడు ప్రోత్సాహంగా ఉంటుందన్నారు. పార్టీలో విభేదాలు లేకుండా సక్రమంగా సాగుతూ అభివృద్ధి సంక్షేమాలను అందిపుచ్చు కోవాలని దానికి సమర్థ నాయకత్వం అవసరం అన్నారు. అనంతరం నిర్వహించిన చింతూరు మండలపార్టీ అధ్యక్షులు ఎన్నికల కార్యక్రమంలో జమాల్ ఖాన్ ని ఏకగ్రీవంగా గ్రామ, క్లస్టర్, బూత్ , మండల కార్యకర్తలు ఎన్నుకున్నారు. ఈ సందర్బంగా నియోజకవర్గం పరిశీలకులు కొల్లుబోయిన శ్రీనివాస్ యాదవ్ జమాల్ ఖాన్ ఎన్నికను ఆమోదించినట్లు తెలిపారు. అనంతరం నూతనంగా ఎన్నికైన జమాల్ ఖాన్ ని శాలువాతో సత్కరించారు. ఈ సందర్బంగా నూతనంగా ఎన్నికైన జమాల్ ఖాన్ మాటాడుతూ పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిల బెట్టుకుంటానని ప్రతీ కార్యకర్తకి అందుబాటులో ఉంటూ పార్టీకి మంచిపేరు తెస్తానన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు విజయ్ భాస్కర్, చింతూరు మాజీ మండలపార్టీ అధ్యక్షులు చిన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
