
రైతులకు ఈ క్రాప్ చేయాలి మరియు ఎరువుల వెంటనే ఇప్పించాలి
చింతూరు జడ్పీటీసీ చిచ్చడి.మురళీ ప్రభుత్వ నీ డిమాండ్ చేసారు
పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ సెప్టెంబర్ 2 అల్లూరి సీతారామరాజు జిల్లా
చింతూరు మండల వైఎస్ఆర్సిపి ప్రజాప్రతినిధులు ఈరోజు సమావేశంలో చింతూరు జడ్పిటిసి చిచ్చడి.మురళి గారు మాట్లాడుతూముఖ్యంగా రైతులు అనుభవిస్తున్న సమస్యలపై స్పందిస్తూ ఈరోజు మండలం మొత్తం కూడావ్యవసాయం పై ఆధారపడి జీవిస్తున్నారు కాబట్టి ప్రభుత్వం సకాలం లో యూరియ మరియు ఎరువులు రైతులకు అందించాలిఅన్నారు అదేవిదంగా ఈ సంవత్సరం మొత్తం సుమారు 12,846.ఎకరాలు వ్యవసాయం చేస్తున్నారు కానీ ఈ క్రాప్ బుకింగ్ 1337 ఎకరాలు మాత్రమే. ఈ క్రాప్ చేయని రైతులకు తీవ్ర నష్టం జరుగుతుంది అన్నారు, ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు మేల్కొని వెంటనే మిగతా 11,509 ఎకరాలు ఈక్రాప్ బుకింగ్ చేయాలి అని అయన ప్రభుత్వ నీ డిమాండ్ చేసారు.మరియు ప్రత్తి పంట సుమారు 522.ఎకరాలు గాను 177 ఎకరాలు మాత్రమే ఈ క్రాప్ చేయడం జరిగింది ఇంకా 345 ఎకరాలు ఈ క్రాఫ్ట్ చేయవలసి ఉంది కానీ ఇంతవరకు వ్యవసాయ శాఖ ఈక్రాప్ చేయలేదు అలాగే ఎరువులకు సంబంధించి చింతూరు మండలానికి మొదటి విడతగా 200 మెట్రిక్ టన్నులు ఆర్డర్ పెట్టగా 40 మెట్రిక్ టన్నులు మాత్రమే యూరియా పంపించడం జరిగింది అలాగే డిఏపి 7 మెట్రిక్ టన్నులు మాత్రమే సరఫరా చేయడం జరిగింది ఇంకా రావలసిన ఎరువులు ప్రభుత్వం రైతులకు ఎప్పుడు సరఫరా చేస్తుంది.ఈ ఎరువులు ఎంతమంది రైతులకు సరఫరా చేయగలరు ? ఇదే కాకుండా ఈ క్రాప్ చేయాలంటే సచివాలయ అగ్రికల్చర్ అసిస్టెంట్ అందుబాటులో ఉండాలి అన్నారు లేనందున ఈ క్రాప్ సరిగా జరగలేదు.అలాగే ఇన్సూరెన్స్ చేయడానికి సమయం కూడా గడిచిపోయింది గత ప్రభుత్వంలోనైతే రైతులకు ఇన్సూరెన్స్ అనేది ముందుగానే ప్రభుత్వమే చెల్లించి వారికి న్యాయం చేసింది కానీ ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం మాత్రం రైతుల నుంచి ముందుగానే ఇన్సూరెన్స్ కోసం ఒక ఎకరానికి 640 ముందుగానే కట్టించుకునే పరిస్థితి ఏర్పడింది ఇది కొంతమంది రైతులకు అవగాహన లేనందున సమయానికి సంబంధిత అధికారి అవగాహన కల్పించలేకపోవడం వలన రైతులు చాలా నష్టపోవాల్సి వచ్చిందిఅని అయన పేర్కొన్నారు అలాగే సచివాలయంలో పనిచేస్తున్న సచివాలయ అగ్రికల్చర్ అసిస్టెంట్లు సచివాలయ హార్టికల్చర్ అసిస్టెంట్లు వీరిని వేరే పనులపై ప్రభుత్వం నియమించడం చేత రైతులకు ఈ సమస్యలు రావడం జరిగింది ఇలా చెప్పుకుంటూ పోతే రైతులకు చాలా ఇబ్బందులు పడ్డారు ఇంకా ఇబ్బందులకు గురవుతూనే ఉన్నారు అది కాకుండా ఈమధ్య వచ్చిన వరదలకు చాలా గ్రామాలకు రహదారులు లేక వారికి కావలసిన నిత్యవసర సరుకులు తెచ్చుకోవడానికి కూడా దారులు లేక ఎన్నో అవస్థలుపడుతున్నారు ఇంకా అనుభవిస్తూనే ఉన్నారు కానీ ఇంతవరకు ఏ అధికారి గానీ అధికారంలో ఉన్న ఏ ప్రజా ప్రతినిధి కూడా వారిని సందర్శించిన ఆనవాళ్లు కూడా లేవు వారికి నిత్యావసర సరుకులు కూడా ఇంతవరకు ఇవ్వలేదు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో సమస్యలు ముంపునకు గురైన ప్రజల గ్రామాలను మనం చూడవచ్చు ఇకనైనా ప్రభుత్వం తక్షణమే స్పందించి వారికి తగిన అన్యాయం చేయాలని అయన ప్రభుత్వనీ డిమాండ్ చేసారు ఈ కార్యక్రమంలో చింతూరు వైఎస్ఆర్సిపి మండలం పార్టీ కన్వీనర్ వై రామలింగారెడ్డి చింతూరు మండల జడ్పీటీసీ చిచ్చడి. మురళీ, చింతూరు మండలం జడ్పిటిసి సవలం అమల చింతూరు పంచాయతీ సర్పంచ్ కారం కన్నా రావు,అలాగే వార్డు మెంబర్ పెసా కమిటీ ఉపాధ్యక్షులు కారం సాయిబాబు చదలవాడ ఉప సర్పంచ్ డి విప్లవ కుమార్ అలాగే పార్టీ నియోజకవర్గ వాణిజ్య విభాగం అధ్యక్షులు కోట్ల కృష్ణ, కుమ్మూరు పార్టీ నాయకులు కుర్సం నాగేశ్వరరావు గతదితరులు నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
