రంపచోడవరంను ఏజెన్సీ ప్రత్యేక కారం తమన్న దొర పేరుతో జిల్లా ప్రకటించాలి,లేదంటే అల్లూరి జిల్లాలోనే కొనసాగించాలి
ఆంధ్రప్రదేశ్ ఆదివాసి జేఏసీ డివిజన్ చైర్మన్ జల్లి నరేష్
- పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ కూనవరం,అక్టోబర్30 అల్లూరి సీతారామరాజు జిల్లా
- చింతూరు డివిజన్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో డివిజన్ చైర్మన్ జల్లి నరేష్ మాట్లాడుతూ గత మూడు రోజులుగా వస్తున్నటువంటి జిల్లా విభజన కార్యక్రమంలో కొన్ని పేపర్లలో వస్తున్న వార్తలకు స్పందించి ఆదివాసీ ప్రాంతాలలో ఆదివాసులు కోరుకుంటున్న టువంటి పోలవరం నియోజకవర్గం, మరియు రంపచోడవరం నియోజకవర్గంని కలిపి రంపచోడవరం కేంద్రంగా కారం. తమన్న దొర పేరుతో ప్రత్యేక ఏజెన్సీ జిల్లాగా ప్రకటించాలని అయన డిమాండ్ చేసారు. కానీ కొన్ని వార్తలు వస్తున్నా కథనాలు పూర్తిగా అల్లూరి జిల్లాను తూర్పుగోదావరి, రాజమండ్రి జిల్లాలో కలిపి చేసే ప్రయత్నాలు మంత్రి వర్గ పేరు తో రంపచోడవరం,చింతూరు డివిజన్లో ఆదివాసులలో ఆందోళన కలిగిస్తున్న విషయం కాబట్టి జరుగుతున్నటువంటి పరిణామాల ఆదివాసీ ప్రజలు ఉద్యమంలో సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు అదేవిధంగా అల్లూరి ఏజెన్సీ ని మైదానప్రాతం కలపాలి అనే కుడిలా రాజకీయలు ప్రభుత్వం మానుకోవాలి అన్నారు ఆదివాసీ లకు పాడేరు ను అల్లూరి సీతరామరాజు జిల్లా లోనే చింతూరు,రంపచోడవరం కొనసాగించాలి సందర్భంగా తెలియజేసారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ జేఏసీ చింతూరు డివిజన్ ప్రచార కార్యదర్శి సోడి.శ్రీను మండల చైర్మన్ పి.రామకృష్ణ,వైస్ చైర్మన్ కాకా సీతరామయ్య,గోరం.రాఘవయ్య కుంజ.సంజీవ్,మడకం.బొజ్జి,మడకం.రమేష్ తదితరులు పాల్గొన్నారు.


