
పయనించే సూర్యుడు మే 21 (పొనకంటి ఉపేందర్ రావు )
టేకులపల్లి మండలం చింతోని చిలక గ్రామంలో గోద్రెజ్ ఆగ్రోవేట్ కంపెనీవారు పామాయిల్ సాగుపై రైతులకుఅవగాహన కల్పించారు పామాయిల్ మొక్కలు ఎకరానికి 57 మొక్కలు వేసుకోవాలి . సాగు చేసిన రైతులకు డ్రిప్పు ఎస్సీ, ఎస్టీ రైతులకు 100% సబ్సిడీ బిసి రైతులకు 90% ఓసి రైతులకు 80% సబ్సిడీపై ఇవ్వబడును మూడు సంవత్సరాల వరకు ఎకరానికి 4200 చొప్పున రైతు ఖాతాలో డబ్బులు జమ చేయబడును ప్రస్తుతానికి మన మండలంలో ఎనిమిది వందల ఎకరాలు విస్తీర్ణం లో పామాయిల్ సాగు చేస్తున్నారు పామాయిల్ మొక్క 30 సంవత్సరాల వరకు గెలలు వస్తాయి నికర ఆదాయం ఉంటుంది కావున రైతులు పామాయిల్ సాగు చేస్తూ అంతర పంటగా మునగ సాగు చేయాలని రైతులకు తెలియజేయడమైనది ఈ యొక్క కార్యక్రమంలో జిల్లా ఉద్యానవన శాఖ అధికారి జే కిషోర్ ఏ.డీ.ఏ లాల్ చంద్ ఎం.ఏ. ఓ. అన్నపూర్ణ హెచ్ ఓ స్రవంతి ఏఈఓ రెహానా జైన్ ఇరిగేషన్ మేనేజర్ మరియు రైతులు పాల్గొన్నారు