
పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ అక్టోబర్ 23
అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం చింతూరు మండలం చిడుమూరు గ్రామ సర్పంచ్ కాక అరుణ కుమారి అధ్యక్షతన గ్రామపంచాయతీ అభివృద్ధి ప్రణాళిక (జీపీడీపీ) గ్రామ సభ జరిగినది ఈ గ్రామ సభలో పంచాయతీ సెక్రటరీ ఈ గ్రామ సభ యొక్క ప్రాధాన్యతను వివరించి గ్రామ అభివృద్ధికి సంబంధించిన అనేక విభాగాల అంశాలను క్రోఢీకరించి ప్రణాళికను రూపొందించుకోవాలని తెలియజేశారు, గ్రామస్తులు వారి సమస్యలను తెలియజేసి త్వరితగతిన పరిష్కరించగలరని విన్నవించుకున్నారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలకు అనుగుణంగా చట్టి గ్రామపంచాయతీ అభివృద్ధి ప్రణాళికను రూపొందించి వీలైనంత త్వరగా గ్రామ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని పంచాయతీ కార్యదర్శి తెలియజేశారు. ఈ గ్రామసభలో ప్రజాప్రతినిధులు ,సచివాలయ సెక్రటరీ గోపాలకృష్ణ, సచివాలయం సిబ్బంది,అంగన్వాడి, ఆశ, డ్వాక్రా యానిమేటర్లు,MGNREGS ఫీల్డ్ అసిస్టెంట్, ఉపసర్పంచి బొక్కలి శాంతమ్మ, పేసా కమిటీ సభ్యులు పిసం దూలయ్య, బొక్కలి రాంబాబు, పిసం రామయ్య, సోయం కన్నయ్య, కుంజా బాలకృష్ణ, మాజీ ఎంపీటీసీ, బొక్కలి ప్రసాద్, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
