
పయనించే సూర్యుడు అక్టోబర్ 4 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)క్రియేటివ్ హార్ట్స్ అకాడమీ 10వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన స్కూల్ లెవెల్ పోస్టల్ చిత్రకళా పోటీలో చేజర్ల జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరిచారు. డ్రాయింగ్ మాస్టర్ తోట కిషోర్ కుమార్ శిక్షణలో 9వ తరగతి విద్యార్థిని డి.వి. కామాక్షి ఇషాని రెండవ స్థానం, 7వ తరగతి విద్యార్థిని ఎండి . షహనాజ్ ఫాతిమా మూడవ స్థానం సాధించారు. ఈ విజయాలను పురస్కరించుకొని కిషోర్ కుమార్‌కు .గ్రేట్ క్రియేటివ్ టీచర్ అవార్డు. లభించింది. స్కూల్ యాజమాన్యం ఆయనను అభినందిస్తూ సంతోషం వ్యక్తం చేసింది. పాఠశాల ఉపాధ్యాయులు సిబ్బంది విద్యార్థి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు