
పయనించే సూర్యుడు ఆగస్టు 25, (చింతకాని మండల రిపోర్టర్. వేర్పుల కోటేశ్వరరావు)చింతకాని మండలం చిన్న మండవ గ్రామంలో కొన్ని నెలల నుండి పారిశుద్ధాన్ని పాటించని అధికారులు. గత కొన్ని నెలల నుండి గ్రామంలో పరిశుద్ధాన్ని పాటించాలని ,అధిక వర్షాలు కారణంగా మరుగు చెత్త పేరుకుపోయి దోమల వలన ప్రజలకు అనారోగ్యం కలుగుతుందని ,పాగింగ్ చేయాలని, వీధి బల్బులు సక్రమంగా నిర్వహించాలని గ్రామస్తులు కోరగా పంచాయతీ సెక్రెటరీ గారు మా వద్ద నిధులు లేవని నిర్వహించలేము అన్నారు. ఇదే సమయంలో చిన్న మండవ గ్రామానికి చెందిన పంచాయతీ సామాగ్రిని పాగి యంత్రాలను వీధి దీపాలను మొదలగు వాటిని వేరే గ్రామానికి అనగా పొద్దుటూరు గ్రామానికి ఎలా ఉపయోగిస్తున్నారు అని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇట్టి విషయం పై మండల అధికారులు వివరణ కోరగా విచారణ చేపడతామని ఉన్నతాధికారులు సూచించారు..