
పయనం చేసి సూర్యుడు న్యూస్ ఆగస్టు 26 సూర్యాపేట జిల్లా ప్రతినిధి:
సూర్యాపేట నియోజకవర్గంలోని తెలంగాణ గురుకుల సాంఘిక సంక్షేమ చివ్వెంల బాలురు జూనియర్ పాఠశాలలో కోహాన్స్ సంస్థ ఆధ్వర్యంలో సుమారు ₹12 లక్షల వ్యయంతో 276 డ్యూయల్ డెస్క్ బెంచీలు విరాళంగా సంస్థ చైర్మన్ పటేల్ శ్రీధర్ రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ శ్రీ పటేల్ రమేష్ రెడ్డి,జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ స్ప్రెడ్ ఇండియా చైర్మన్ పటేల్ శ్రీధర్ రెడ్డి.అలాగే కోహాన్స్ లైఫ్ సైన్సెస్ సంస్థ ప్రతినిధులు,అధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా పటేల్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ,ఈ పాఠశాలలో,ప్రిన్సిపాల్ ప్రస్తావించిన
సమస్యల పరిష్కారానికి ఒకదాని తరువాత ఒకటి చర్యలు తీసుకుంటున్నాం ఇక్కడ టాయిలెట్లు అవసరం ఉందని చెప్పగానే జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి ₹10 లక్షల నిధులు మంజూరు చేయడం అభినందనీయం అలాగే డ్యూయల్ డెస్క్ బెంచిల కోసం నేను కోహాన్స్ సంస్థ వలాని కలిసినప్పుడు వాళ్లు వెంటనే సహకరించారు.వాళ్ళ సహకారంతో 276 బెంచీలు ఏర్పాటు చేయడం సంతోషకరం అన్నారు. అదే విధంగా టాయిలెట్స్ అవుట్‌లెట్ పైపులైన్ల కోసం నేను అడగగానే సుధాకర్ పీవీసీ వాళ్లు ₹2 లక్షల విలువైన పైపులను ఉచితంగా అందించడం విశేషం.త్వరలోనే కోహాన్స్ సంస్థ ఆధ్వర్యంలో ఈ పాఠశాలలో ఆధునిక కంప్యూటర్ ల్యాబ్ కూడా ఏర్పాటు కానుంది.రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంజూరైన ₹1 కోటి రూపాయలు నిధులతో ఓవర్హెడ్ ట్యాంక్,గార్డెన్, గ్రీన్,క్యాంపస్ క్లాస్ రూమ్‌లు వంటి సౌకర్యాలను కల్పించడానికి చర్యలు ప్రారంభమవుతున్నాయి.అదేవిధంగా స్ప్రెడ్ ఇండియా సంస్థ మరియు శ్రీధర్ రెడ్డి సహకారంతో విద్యార్థుల కోసం స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు కూడా త్వరలో ప్రారంభించబోతున్నాము,ఈ పాఠశాలను ఒక మోడల్ స్కూల్గ్ అభివృద్ధి చేసి ఇక్కడ చదువుతున్న ప్రతి విద్యార్థి రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధించి సూర్యాపేట జిల్లా గర్వించేటట్లు చేయడం మా లక్ష్యం.పాఠశాల అభివృద్ధి కోసం విద్యార్థుల భవిష్యత్తు మెరుగుదలకు నేను ఎల్లప్పుడూ అండగా ఉంటాను అని తెలిపారు.

